Nigar Sultana: బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టులో తీవ్ర వివాదం రాజుకున్నా విషయం తెలిసిందే. ఆ జట్టు మాజీ పేసర్ జహానారా అలం చేసిన ఆరోపణలు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. జహానారా 2024లో చివరిసారిగా బంగ్లాదేశ్ తరఫున ఆడగా.. కెప్టెన్ నిగార్ సుల్తానా జోటీ తన కంటే జూనియర్ ప్లేయర్లను కొట్టిందని సంచలన ఆరోపణలు చేసింది. జోటీ జూనియర్లను తరచూ కొడుతుందని ఆమె ఓ పత్రికకు తెలిపింది. అయితే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ (BCB) ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. జట్టుపై, కెప్టెన్‌పై, మేనేజ్‌మెంట్‌పై తమకు సంపూర్ణ నమ్మకం ఉందని స్పష్టం చేసింది. ఈ విమర్శల నేపథ్యంలో జోటీ కూడా స్పందించింది. కానీ, ఆమె సమాధానంలో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయంశంగా మారింది.
iBomma: పైరసీ నష్టం సరే.. మరి సినీ పెద్దల దోపిడీ సంగతేంటి?
నిగార్ సుల్తానా మాట్లాడుతూ.. “నేను ఎవరినైనా ఎందుకు కొడతాను? స్టంప్స్‌ను బ్యాట్‌తో కొట్టినట్లు నేనూ కొడతానా? నేను హర్మన్‌ప్రీత్‌నా? అలా స్టంప్స్ కొడుతూ తిరగడానికి? నా వ్యక్తిగత స్పేస్‌లో, నేను వంట చేస్తూ ఉండవచ్చు, బ్యాట్‌ను గోడకు తాకించవచ్చు, హెల్మెట్‌ను కొట్టవచ్చు… అవి నా విషయాలు. కానీ, నేనెవరినైనా హార్ట్ చేయాలనుకుంటానా? ఎందుకు చేస్తాను?” అంటూ వ్యాఖ్యానించింది.
అయితే ఆమె ప్రస్తావించిన సంఘటన 2023లో భారత్ బంగ్లాదేశ్ టూర్ సందర్భంగా జరిగింది. మూడో వన్డేలో హర్మన్‌ప్రీత్ కౌర్ LBW అవుట్ అవ్వడంతో కోపంతో స్టంప్స్‌పై బ్యాట్‌తో దాడి చేయడం, అంపైర్‌పై ఆగ్రహంగా మాటలాడటం వివాదం సృష్టించింది. ఆ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 226 పరుగుల లక్ష్యం నిర్దేశించగా, భారత్ 225 పరుగులకు ఆలౌటై డ్రాగా ముగిసింది. దీంతో సిరీస్ 1-1తో సమమై ట్రోఫీ షేర్ చేసుకున్నారు. ఆ సమయంలో హర్మన్‌ప్రీత్ ప్రేక్షకులకు కూడా ‘థమ్స్ అప్’ చూపించిన ఘటన పెద్ద ఎత్తున విమర్శలకు దారితీసింది. ఆ ప్రవర్తన కారణంగా ఆమెపై రెండు మ్యాచ్‌ల నిషేధం విధించబడింది.