Anmol Bishnoi: ఎన్సీపీ నాయకుడు బాబా సిద్ధిఖీ హత్య కేసులో వాంటెడ్ గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌ను బుధవారం ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు జాతీయ దర్యాప్తు సంస్థ 11 రోజుల కస్టడీకి పంపింది. అమెరికా నుంచి బహిష్కరించబడిన తర్వాత ఫెడరల్ ఏజెన్సీ అతడిని అరెస్ట్ చేసిన తర్వాత, అన్మోల్‌ని సాయంత్రం 5 గంటల ప్రాంతంలో గట్టి భద్రత మధ్య ఎన్ఐఏ కోర్టులో హాజరుపరిచింది.
యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్‌కి ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయా? సోషల్ మీడియాలో లీక్ అవుతున్న వీడియోలు అనుమానాలకు తావిస్తున్నాయి. వారం రోజులు అయిపోయిన సన్నీ జాడలేదు. అదుపులోకి తీసుకున్నామని ఎన్‌ఐఏ అధికారికంగా ప్రకటించకపోయినా.. రహస్య ప్రదేశంలో విచారిస్తూ.. కూపీ లాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో కలిసి విచారిస్తు్న్నారంటే సన్నీ వెనకు పెద్ద కుట్ర దాగి ఉందా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
వారం రోజులైనా యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ జాడ తెలియలేదు. చెన్నై ఎయిర్ పోర్ట్ లో దిగగాని యూట్యూబర్ సన్నీని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నైలో రహస్య ప్రాంతంలో సన్నీ బయ్యను విచారిస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. జ్యోతి మల్హోత్ర, సన్నీలను కలిపి ఎన్‌ఐఏ విచారిస్తున్నట్లుగా చెబుతున్నారు.