టీవీఎస్ తన పాపులర్ స్కూటర్ టీవీఎస్ స్కూటీ జెస్ట్ కొత్త వేరియంట్ SXC ని విడుదల చేసింది. ఈ కొత్త వేరియంట్ రూ. 75,500 ఎక్స్-షోరూమ్ ధరతో విడుదలైంది. తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్లతో వస్తోంది. కొత్త TVS స్కూటీ జెస్ట్ SXCలో వేగం, ఇంధన స్థాయి, ఓడోమీటర్, ట్రిప్‌మీటర్ వంటి సమాచారాన్ని ప్రదర్శించే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉంది. ఇది ఇప్పుడు బ్లూటూత్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీని కూడా కలిగి ఉంది. కాల్, SMS హెచ్చరికలను అందిస్తోంది.…
హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) భారతదేశంలో కొత్త 2025 డియో 125 ను విడుదల చేసింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 96,749గా కంపెనీ ప్రకటించింది. యువతను దృష్టిలో ఉంచుకుని ఈ స్కూటర్‌ను సరికొత్తగా తయారు చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఈ కొత్త డియో 125 అద్భుతమైన డిజైన్, సరికొత్త ఫీచర్లతో మెరుగైన సామర్థ్యం కలిగి ఉంది. ఈ కొత్త బండి స్పోర్టి, స్టైలిష్ మోటో-స్కూటర్‌గా ఆకర్షణీయంగా ఉంటుంది.
Hero Xoom 160: హీరో మోటోకార్ప్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. టూ-వీలర్ మార్కెట్‌లో ఈ పేరు అందరికీ సుపరిచితమే. ఈ సంస్థ తయారు చేసే వాహనాలకు భారతీయులకు ప్రత్యేక స్థానం ఉంది. ఇకపోతే గత కొద్దిరోజులుగా స్కూటర్ సెగ్మెంట్‌లోనూ హీరో సంస్థ తన ప్రత్యేకతను చూపిస్తోంది. ఇటీవల నిర్వహించిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో హీరో జూమ్ 160 (Xoom 160) స్కూటర్‌ను లాంచ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. నిజానికి…