హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) భారతదేశంలో కొత్త 2025 డియో 125 ను విడుదల చేసింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 96,749గా కంపెనీ ప్రకటించింది. యువతను దృష్టిలో ఉంచుకుని ఈ స్కూటర్‌ను సరికొత్తగా తయారు చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఈ కొత్త డియో 125 అద్భుతమైన డిజైన్, సరికొత్త ఫీచర్లతో మెరుగైన సామర్థ్యం కలిగి ఉంది. ఈ కొత్త బండి స్పోర్టి, స్టైలిష్ మోటో-స్కూటర్‌గా ఆకర్షణీయంగా ఉంటుంది.
READ MORE: Vijayasai Reddy: ఒక రోజు ముందుగానే సిట్ విచారణకు విజయసాయిరెడ్డి..
ఈ స్కూటీ DLX, H-స్మార్ట్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. DLX ధర రూ.96,749 (ఎక్స్-షోరూమ్), H-స్మార్ట్ ధర రూ.1,02,144. ఈ సరికొత్త డియో 123.92cc, సింగిల్-సిలిండర్, PGM-Fi ఇంజిన్‌తో పనిచేస్తుంది. 6.11 kW, 10.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీంట్లో ఐడ్లింగ్ స్టాప్ సిస్టమ్‌ను కూడా అమర్చారు. మ్యాట్ మార్వెల్ బ్లూ మెటాలిక్, పెర్ల్ డీప్ గ్రౌండ్ గ్రే, పెర్ల్ స్పోర్ట్స్ ఎల్లో, పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, ఇంపీరియల్ రెడ్ అనే 5 రంగుల్లో అందుబాటులోకి వస్తోంది.
READ MORE: Bhatti Vikramarka : ఒడిశాలో నైనీ గని ప్రారంభం.. సింగరేణికి జాతీయ విస్తరణలో కొత్త అధ్యాయం
ఇది కొత్త 4.2-అంగుళాల TFT డిస్ప్లేను కలిగి ఉంది. మైలేజ్, ట్రిప్ మీటర్, రేంజ్, పర్యావరణ పరిస్థితులు, సమయం వంటి డేటాను చూపుతుంది. కొత్త మోడల్ హోండా రోడ్‌సింక్ యాప్‌తో అనుసంధానించారు. ఇందులో కాల్/మెసేజ్ లు, నావిగేషన్‌ను కూడా వస్తోంది. అలాగే స్మార్ట్ కీ, USB టైప్-C ఛార్జర్, ఇంజిన్ స్టార్ట్/స్టాప్ సిస్టమ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.