తాను అధికార బాధ్యతల నుంచి తప్పుకోను.. త్వరలోనే కొత్త ప్రధాన మంత్రిని నియమిస్తానని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఆయన ఎలిసీ ప్యాలెస్ నుంచి ఫ్రాన్స్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. మీరు ఐదేళ్లు పాలించమని నాకు అధికారం ఇచ్చారు.. అన్ని వ్యవస్థలను సక్రమంగా నడిపిస్తాను.. ప్రజలను రక్షిస్తూ దేశాన్ని ముందుకు తీసకెళ్లే బాధ్యత నాపై ఉందని మెక్రాన్ చెప్పుకొచ్చారు.
జపాన్ కొత్త ప్రధానిగా షిగేరు ఇషిబా ఎన్నికయ్యారు. మాజీ రక్షణ మంత్రి షిగెరు ఇషిబా.. తన ఐదవ ప్రయత్నంలో జపాన్ ప్రధానమంత్రి పదవిని దక్కించుకున్నారు. ఫ్యూమియో కిషిదా తర్వాత తొమ్మిది మంది అభ్యర్థుల మధ్య జరిగిన అత్యంత పోటీ రేసులో షిగేరు ఇషిబా విజయం సాధించారు.
శ్రీలంక నూతన ప్రధానమంత్రిగా హరిణి అమరసూర్య ప్రమాణస్వీకారం చేశారు. నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్‌పీపీ)కి చెందిన ప్రముఖ నాయకురాలు అమరసూర్య ఈ పదవిని చేపట్టిన 16వ వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. హరిణి అమరసూర్య ఎన్‌పీపీ నుంచి పార్లమెంటు సభ్యురాలుగా ఉన్నారు.
శ్రీలంక కొత్త ప్రధానిగా రణిల్ విక్రమసింఘే బాధ్యతలు చేపట్టారు. అధ్యక్షుడు గోటబయ రాజపక్సే రణిల్ విక్రమసింఘే చేత ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలు అప్పగించారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకను విషమ పరిస్థితుల నుంచి బయటపడేసే బాధ్యత ప్రస్తుతం రణిల్ విక్రమసింఘేపై ఉంది. ఇటీవల శ్రీలంకలో నిరసనలు తీవ్రమై హింసాత్మకంగా మారాయి. దీంతో ప్రధాని పదవిలో ఉన్న మహిందా రాజపక్సే తన పదవికి రాజీనామా చేశారు. దీంతో కొత్త ప్రధాని ఏర్పాటు అనివార్యమైంది. బుధవారం దేశప్రజలను…
తీవ్ర ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక తీవ్ర ఇబ్బందులను ఎదర్కొంటోంది. ఇన్నాళ్లు శాంతియుతంగా సాగిన నిరసన, ఆందోళన కార్యక్రమాలు ఒక్కసారిగా హింసాత్మకంగా మారాయి. ప్రజలు అధ్యక్షడు గోటబయ రాజపక్సేతో పాటు ప్రధాని పదవిలో ఉన్న మహిందా రాజపక్సేలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రధాని పదవికి రాజీనామా చేశారు మహిందా రాజపక్సే. భద్రతా కారణాల వల్ల ఆర్మీ ఆయన్ను సేఫ్ ప్లేస్ కు తరలించింది. తాజాగా దేశం విడిచి వెళ్లకుండా శ్రీలంక కోర్ట్ నిషేధం విధించింది.…