ఆంధ్రప్రదేశ్‌పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం.. భారీ మార్పులకు పూనుకున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.. దానికి తగ్గట్టుగానే అధిష్టానం.. రాష్ట్రానికి చెందిన నేతలతో విడివిడిగా సమావేశం కూడా అయ్యింది.. ఈ నేపథ్యంలో కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక త్వరలోనే జరగనున్నట్టు తెలుస్తోంది.. ప్రస్తుతం పీసీసీ చీఫ్‌గా ఉన్న శైలజానాథ్ ను మార్చాలని అధిష్ఠానం నిర్ణయానికి రాగా.. కొత్త అధ్యక్షుడి వేటలో పడింది.. దీని కోసం పరిశీలనలో చింతామోహన్, జేడీ శీలం, హర్షకుమార్ పేర్లు…
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు రాహుల్ గాంధీ… ఈ నెల 11న ఏపీ కాంగ్రెస్ నేతలతో వరుస భేటీలు జరగనున్నాయి.. 11 వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి విడివిడిగా ఏపీ సీనియర్ నేతలతో ముఖాముఖి సమాలోచనలు జరపనున్నారు రాహుల్ గాంధీ.. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నుంచి రాష్ట్ర నేతలకు పిలుపు అందింది.. ఆ తర్వాత ఏపీ కాంగ్రెస్ పలు కీలక మార్పులు చేర్పులు జరగనున్నాయని తెలుస్తోంది.. పీసీసీ…