ఐపీఎల్ సృష్టికర్త, మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ మరో కొత్త ప్రేయసిని పరిచయం చేశారు. గతంలో మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌ను పరిచయం చేశారు. ఆమెతో డేటింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఫొటోలు పంచుకున్నారు.
క్రికెటర్ హార్దిక్ పాండ్యా మరోసారి వార్తల్లోకెక్కాడు. సింగర్-మోడల్ జాస్మిన్ వాలియాతో పాటు అతని పేరు ట్రెండింగ్‌లో ఉంది. వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందనే టాక్ వినిపిస్తోంది. కొందరు నెటిజన్లు ఇద్దరూ ఒకే దగ్గరుండి విహారయాత్ర చేస్తున్న ఫొటోలను గుర్తించారు. దీంతో.. వీరిద్దరు వైరల్ అయ్యారు. ఈ క్రమంలో నెటిజన్లు సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు.