తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వపు, తెలంగాణ శాసన మండలి ద్వారా 2020 సంవత్సరంలో మల్లారెడ్డి విశ్వవిద్యాలయం హైదరాబాద్ లో స్థాపించబడింది. 200 ఎకరాలలో విస్తరించిన విశాలమైన ప్రాంగణంలో నిర్మితమైన ఈ విశ్వ విద్యాలయం పారిశ్రామిక ప్రయోజనకరమైన ప్రత్యేకమైన అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తున్నది. అంతర్జాతీయ ప్రమాణాల మేరకు ఉన్నతమైన నాణ్యత కలిగిన విద్యను అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నది. నిరంతరం సరికొత్త విధానాలను అన్వేషిస్తూ, వాటిని అనుసరిస్తూ, నిరంతరాయంగా నాణ్యమైన ఉన్నత విద్యను అందించేందుకు కృషి చేస్తున్నది.…