Manisha Koirala: నేపాల్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత పెద్ద ఎత్తున నిరసనలు జరిపింది. ఈ ఆందోళనలతో ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. ఈ హింసాత్మక ఆందోళనల్లో 50 మందికి పైగా మరణించారు. ప్రస్తుతం, నేపాల్ మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కార్కీ ప్రధానిగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఇదిలా ఉంటే, ఈ రాజకీయ గందరగోళం నేపథ్యంలో ప్రముఖ నటి మనీషా కోయిరాలా మాట్లాడిన పాత వీడియో వైరల్‌గా మారింది.
Sushila Karki: నేపాల్‌లో కొత్త శకం మొదలైంది. హిమాలయ దేశానికి తొలి మహిళా ప్రధానిగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కీ ప్రమాణస్వీకారం చేశారు. అవినీతికి వ్యతిరేకంగా జెన్-జెడ్ నిరసనకారులు చేసిన ఆందోళనలతో కేపీ శర్మ ఓలీ ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. జెన్-జెడ్ ప్రతినిధులు, ఆర్మీ, అధ్యక్షుడితో జరిపిన చర్చల్లో సుశీల కర్కీని ప్రధానిగా ఎన్నుకున్నారు. ఆమె చేత అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ప్రమాణస్వీకారం చేయించారు.
Balendra Shah: సోషల్ మీడియాపై నేపాల్ ప్రభుత్వం బ్యాన్ విధించడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. జెన్-జీ యువత రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. సోమవారం జరిగిన కాల్పుల్లో 19 మంది ఆందోళనకారులు మరణించడంతో, ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.
Nepal: భారతదేశ వ్యాపారవేత్త తనను ప్రధాని చేయడానికి ప్రయత్నాలు చేశారంటూ నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ అలియాస్ ప్రచండ చేసిన వ్యాఖ్యలు ఆ దేశంలో అగ్గిరాజేశాయి. ప్రధాని వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రంగా విరుచుకుపడ్డాయి. కొందరు ప్రజాప్రతినిధులు నేపాల్ రాజకీయాల్లో భారత్ కలుగజేసుకోవడంపై విమర్శలు గుప్పించారు.