గతంలో ఎన్నడూ లేని విధంగా కురిసిన వర్షాలతో ఏపీలో జలాశయాలు నిండుకుండల్లా మారాయి. నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువలో వుంది. రిజర్వాయర్ కి సంబంధించిన ఆరు గేట్లును ఎత్తి 36,750 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.
జలాశయం పూర్తి నీటి మట్టం 78 టిఎంసిలు కాగా ప్రస్తుత నీటిమట్టం 76.639 టీఎంసీలకు చేరుకుంది. పెన్నా పరీవాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీచేశారు ఇరిగేషన్ అధికారులు. ఇదిలా వుండగా ..సంగం బీరాపేరు వాగులో మహిళ మృతదేహం లభ్యం అయింది. నిన్న రెండు మృత దేహాలు గుర్తించారు. ఇవాళ తెల్లవారు జామున మరో మృతదేహం లభ్యం అయింది. మిగిలిన ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది.