ఐదేళ్లపాటూ జగన్ తుగ్లక్ పాలనను అందించారని 2014 లో టీడీపీ ప్రారంభించిన అభివృద్ధి పనులను నిలిపేశారని మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి మాట్లాడారు. జగన్ ప్రభుత్వం నిలిపేసిన పనులన్నీ కూటమి ప్రభుత్వం మళ్లీ ప్రారంభించిందని స్పష్టం చేశారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం రైతులు 34 వేల ఎకరాల భూమి ఇచ్చారని మంత్రి తెలిపారు. ప్రస్తుతం రూ.64 వేల కోట్ల తో అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు.
నెల్లూరు జిల్లా కోవూరు మండలం మోడేగుంట గ్రామంలో కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక ఈ సభలో ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. మొదటి నుండి తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న వాళ్ళను పక్కనపెట్టి ఒక కోటేశ్వరాలిని నాపై పోటీకి పెట్టారు. జగన్ ద్వారా లబ్ధి పొంది ఆరు సంవత్సరాలు రాజ్యసభ పదవిని వేమిరెడ్డి అనుభవించారు. నెల్లూరులో ఓ మైనార్టీ కి వైసీపీ తరఫున టికెట్ ఇచ్చారని అలిగి పార్టీని వదిలి…
నెల్లూరు జిల్లాలో దొంగలు తెగబడ్డారు. కావలిలోని వివిధ ఇళ్లలో చోరీ చేసిన బంగారాన్ని నెల్లూరులోని అటికా గోల్డ్‌లో దొంగలు అమ్మినట్లు తెలిసింది. ఈ అమ్మకానికి అటికా గోల్డ్ కంపెనీ ఉద్యోగి సల్మాన్ ఖాన్ సహకరించినట్లు విచారణలో తెలిసింది.
Nellore : ప్రశాంతంగా ఉండే నెల్లూరు కలెక్టరేట్ ప్రాంగణం ఒక్క సారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓ యువకుడు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అధికారులు ఉలిక్కిపడ్డారు. వివరాల్లోకి వెళితే.. హేమంత్ కుమార్ అనే దివ్యాంగుడు టీ పీ గూడురు నివాసి.
festival rottela panduga starts august 9th: నేటి నుంచి నెల్లూరులో ప్రతిష్టాత్మకంగా జరిగే బారాషహీద్ రొట్టెల పండుగ ప్రారంభంకానుంది. ఈ దర్గాకు దేశ, విదేశాల్లో ఎంతో ప్రాశస్త్యం పొందిన నెల్లూరు బారాషహీద్ దర్గా రొట్టెల పండగ నేటి నుంచి 13 వరకు జరగనుంది. ఈ మేరకు జిల్లా వక్ఫ్‌బోర్డు, అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. అయితే.. రెండేళ్లుగా కరోనా వల్ల ఉత్సవం వైభవంగా నిర్వహించలేదు. ఇప్పుడిప్పుడే కోరానా కాస్తా తగ్గడంతో లక్షల్లో భక్తులు తరలివస్తారని అధికారులు…