నెల్లూరు జిల్లా కోవూరు మండలం మోడేగుంట గ్రామంలో కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక ఈ సభలో ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. మొదటి నుండి తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న వాళ్ళను పక్కనపెట్టి ఒక కోటేశ్వరాలిని నాపై పోటీకి పెట్టారు. జగన్ ద్వారా లబ్ధి పొంది ఆరు సంవత్సరాలు రాజ్యసభ పదవిని వేమిరెడ్డి అనుభవించారు. నెల్లూరులో ఓ మైనార్టీ కి వైసీపీ తరఫున టికెట్ ఇచ్చారని అలిగి పార్టీని వదిలి వెళ్ళిపోయారు. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఇచ్చిన ప్రాధాన్యత జగన్ ఎవ్వరికి ఇవ్వలేదు అంటు పేర్కొన్నాడు.
Also Read: YS Avinash Reddy: నేనేంటో నా మనస్తత్వం ఏంటో ఇక్కడి ప్రజలకు తెలుసు..
ఇంకా అలాగే నేను మీ వాడిని.. అందరి వాడిని.. మీలో ఒకడిని.. ఏరోజైనా మీకోసం మా ఇంటి తలుపులు తెరిచి ఉంటాయి. కోవూరు నుంచి నేను.. నా తండ్రి 11 సార్లు పోటీ చేస్తే 9 సార్లు మమ్మలిని మీరు గెలిపించారు. ఇకపోతే., ఆ ఇంటి గడప తొక్కాలంటే నాలుగైదు గేట్లు దాటి పోవాలి. అంతేకాకుండా అక్కడ కుక్కలుంటాయి..పేదవాళ్లు ఆ ఇంటికి పోవాలంటే చాలా కష్టమైన పని అని అంటూనే.. మీకు వారు అందుబాటులోకి రారు.. ఆయన చుట్టూ కేవలం కోటేశ్వరులు, పారిశ్రామికవేత్తలు మాత్రమే ఉంటారని., వాళ్లకు మాత్రమే తలుపులు తెరుచుంటాయని చెప్పుకొచ్చారు.
Also Read: Viral Video : పానీపూరి లవర్స్ షాక్.. ఇది చూస్తే జన్మలో తినరు..
అయితే ఎలక్షన్స్ నేపథ్యంలో టీడీపీ నేతలు ఓటుకు 5 వేలు ఇస్తారంటని, అయితే మీరు వాటిని బంగారంగా తీసుకోండని చెబుతూ.. తీసుకొని ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుకు వేయండి అంటు ప్రచారం చేసారు. ఇక చివరిగా అసెంబ్లీకి నన్ను, ఎంపీగా పోటీ చేస్తున్న విజయ సాయి రెడ్డిని ఇద్దరినీ పెద్ద మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను విజ్ఞ్యప్తి చేసారు.