Nellore:వాళ్లిద్దరూ గిరిజనులు.. పెన్నా నది ఒడ్డున నివసిస్తూ.. చేపలు పట్టుకుని జీవనం సాగించేవారు.. అలాంటి వారిని గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా హత మార్చారు. కర్రలు రాళ్లతో కొట్టి హత్య చేశారు. ఈడ్చుకుంటూ తీసుకు వచ్చి సమీపంలోని పెన్నా బ్యారేజ్‌లో పడేశారు.. భయాందోళన కలిగించే ఈ ఘటన నెల్లూరులోని పెన్నా బ్యారేజీ సమీపంలో జరిగింది.
Nellore : ప్రశాంతంగా ఉండే నెల్లూరు కలెక్టరేట్ ప్రాంగణం ఒక్క సారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓ యువకుడు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అధికారులు ఉలిక్కిపడ్డారు. వివరాల్లోకి వెళితే.. హేమంత్ కుమార్ అనే దివ్యాంగుడు టీ పీ గూడురు నివాసి.