Nellore:వాళ్లిద్దరూ గిరిజనులు.. పెన్నా నది ఒడ్డున నివసిస్తూ.. చేపలు పట్టుకుని జీవనం సాగించేవారు.. అలాంటి వారిని గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా హత మార్చారు. కర్రలు రాళ్లతో కొట్టి హత్య చేశారు. ఈడ్చుకుంటూ తీసుకు వచ్చి సమీపంలోని పెన్నా బ్యారేజ్‌లో పడేశారు.. భయాందోళన కలిగించే ఈ ఘటన నెల్లూరులోని పెన్నా బ్యారేజీ సమీపంలో జరిగింది.
READ MORE: Megastar : క్లాస్ లుక్ లో మన ‘మెగాస్టార్’ చిరు లేటెస్ట్ ఫొటోస్
అసలు ఏం జరిగిందంటే.. నెల్లూరులోని రంగనాయకులు పేట సమీపంలో ఉన్న పెన్నా బ్యారేజ్ వద్ద రక్తపు చారలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న సంతపేట పోలీసులకు కళ్లు బైర్లు కమ్మే దృశ్యం కనిపించింది. రోడ్డుపైన రక్తపు చారలు ఉండడంతో.. పక్కనే ఉన్న బ్యారేజ్‌లో పరిశీలించారు. అందులో ఓ మృతదేహం నీటిపై తేలియాడుతూ కనిపించింది. దాన్ని బయటికి లాగే ప్రయత్నం చేస్తుండగానే.. సమీపంలో మరో మృతదేహాన్ని సంతపేట పోలీసులు గుర్తించారు. డబుల్ మర్డర్ జరిగిందని తెలియడంతో అందరూ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.. స్పాట్..
READ MORE: CJi Gavai vs BJP: న్యాయవాది ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే.. సీజేఐ దాడిపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
నెల్లూరు పెన్నా బ్యారేజ్‌కి సమీపంలో చేపలు పట్టుకుంటూ గిరిజనులు జీవనం సాగిస్తుంటారు. అక్కడ ఉంటున్న పోలయ్యతో పాటు మరో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పెన్నా బ్రిడ్జి దగ్గరికి వారిద్దరిని తీసుకొచ్చి కర్రలు, రాళ్లతో మోది.. పక్కనే ఉన్న పెన్నా నదిలో పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇద్దరినీ చంపి.. ఒకరిని పక్కనే ఉన్న పెన్నా నదిలో పడేయగా.. మరొకరిని సుమారు 100 మీటర్ల పాటు లాక్కొచ్చి పెన్నా నదిలో పడేశారు. అయితే ఈ డబుల్ మర్డర్‌కు కారణం ఎవరు ..? ఎందుకు చంపాల్సి వచ్చింది? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. డబుల్ మర్డర్ సమాచారం తెలిసిన వెంటనే నెల్లూరు జిల్లా సబ్ డివిజన్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎస్పీ ఆదేశాలతో.. టౌన్ డిఎస్పీతోపాటు నలుగురు CI లు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
READ MORE: ICC Player of the Month: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రేసులో భారత స్టార్ ప్లేయర్స్..
క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ స్పాట్‌కు చేరుకొని ఆధారాలు సేకరించే ప్రయత్నం చేశాయి. డాగ్ స్క్వాడ్ మర్డర్ జరిగిన సమీప ప్రాంతంలోనే తిరిగింది. దాని నుంచి ఎలాంటి క్లూ బయటికి రాకపోవడంతో.. పోలీసులు సమీపంలో ఉండే సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.. ఇంత దారుణంగా హతమార్చాల్సిన అవసరం ఏంటి అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన ఇద్దరు వ్యక్తులు 25 ఏళ్లలోపు యువకులు కావడం.. చేపలు పట్టుకునే గిరిజనులు కావడంతో.. ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన వారికి ఎవరితోనైనా పాత కక్షలు ఉన్నాయా? లేక మరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. మృతులలో ఒకరి వివరాలు మాత్రమే పోలీసులు కనిపెట్టారు. మరో యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది..