New Parliament: మే 28న కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్, వామపక్షాలు, డీఎంకే, ఆప్, టీఎంసీతో సహా 19 పార్టీలు బహిష్కరించాయి.
మహారాష్ట్ర రాజకీయాల్లో మరో భూకంపం వస్తుందా? అంటే తాజా పరిస్థితిని బట్టి అవుననే సమాధానం వినిపిస్తోంది. రాష్ట్రంలో అధికార కూటమి- ఎన్డీయేలో అనూహ్య మార్పు రావచ్చు. మూలాల ప్రకారం, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన పదవిని సీఎం ఏక్నాథ్ షిండేతో మార్చుకోవచ్చు.
తమిళనాడులో అన్నాడీఎంకే, దాని మిత్ర పక్షం బీజేపీకి మధ్య విభేదాలు తలెత్తిన నేపథ్యంలో పొత్తు ఉంటుందా? లేదా ? అన్నది ఆసక్తి రేపుతోంది. ఐదుగురు బీజేపీ నేతలు అన్నా డీఎంకేలో చేరడంతో మొదలైన వివాదం ముదిరింది.
KCR: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగింది.. దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్కటి కూడా రాలేదని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇదేనా ఫెడరల్ వ్యవస్థ?.. తెలంగాణకు రావాల్సిన రూ.470 కోట్లు ఏపీకి ఇచ్చారన్నారు.
Bihar Politics: బీహార్ రాజకీయాల్లో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వం టార్గెట్ గా బీజేపీ పావులు కదుపుతోంది. గతంలో ఎన్డీయేలో భాగంగా బీజేపీతో పొత్తులో ఉన్న నితీష్ కుమార్ జేడీయూ పార్టీ.. ఆ పొత్తు కాదనుకుని లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ పార్టీతో జతకట్టింది. దీంతో అధికారంలో ఉన్న బీజేపీ ప్రతిపక్షానికి పరిమితం కావాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే గతం నుంచి బీహార్ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. జేడీయూ…
ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే.. గెలిచేది ఎవరు? మళ్లీ ప్రధాని అయ్యేది ఎవరు? అంటూ ఇండియా టీవీ ‘వాయిస్ ఆఫ్ ది నేషన్’ పేరుతో ఒపీనియన్ పోల్ నిర్వహించింది… ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ భారీ విజయం సాధిస్తుందని అంచనా వేసింది.. ఉన్నట్టుండి ఎన్నికలు జరిగితే ఎన్డీఏకు 41 శాతం, యూపీఏకు 28 శాతం, ఇతరులకు 31 శాతం ఓట్లు రావచ్చని ఈ సర్వే అంచనా వేసింది.. లోక్‌సభకు ఇప్పటికిప్పుడు…
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో టిఆర్ఎస్ వైఖరి ఏంటి? విపక్షాల అభ్యర్థికి మద్దతిస్తుందా? దక్షిణాది లేదా తెలుగు రాష్ట్రాలకు చెందినవారు బరిలో ఉంటే ఏం చేస్తారు? గులాబీ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి? రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించింది తెలంగాణలోని అధికార టీఆర్‌ఎస్ పార్టీ. హైదరాబాద్ వచ్చిన సిన్హాకు ఘన స్వాగతం పలికింది కూడా. ఇదే అంశంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, NCP చీఫ్ శరద్ పవార్ నిర్వహించిన సమావేశాలకు టీఆర్ఎస్ వెళ్లలేదు.…
ఈ నెల 12వ తేదీన హైదరాబాద్కు రానున్నారు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము.. ప్రత్యేక విమానంలో బేగంపేట్ ఎయిర్పోర్ట్కు రానున్న ఆమెకు ఘనంగా స్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి
రాష్ట్రపతి ఎన్నికల బరిలో ఇద్దరే నిలిచారు. శనివారం నామినేషన్ విత్ డ్రా చివరి రోజున రాష్ట్రపతి పదవి రేసులో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపతి ముర్ముతో పాటు విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఇద్దరు మాత్రమే నిలిచారు. మొత్తం 115 నామినేషన్లు దాఖలు అయితే వాటిలో 107 నామినేషన్లు సరైన విధంగా లేకపోవడంతో ఎన్నికల అధికారులు వీటిని తిరస్కరించారు. ముర్ము, యశ్వంత్ సిన్హాలు ఇద్దరు నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. జూన్ 29 వరకు 94…