Sanjay Raut: బీజేపీ మొసలి, కొండ చిలువ.. వారితో వెళ్తే అంతే సంగతులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjay Raut: భారతీయ జనతా పార్టీ(బీజేపీ)పై ఘాటు విమర్శలు చేశారు శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్. శనివారం బీజేపీని మొసలి, కొండచిలువతో పోల్చారు. ఒకరు రోజు ముందు శివసేన ఎంపీ గజానన్ కీర్తీకర్ మాట్లాడుతూ.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి శివసేన పార్టీపై సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని ఆరోపించారు. ఈ ఆరోపణల తర్వాత ఈ రోజు సంజయ్ రౌత్ బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టారు.
బీజేపీ ఎవరినైనా మింగే మొసలి, కొండచిలువ లాంటిదని అన్నారు. దానితో వెళ్తే ఇక అంతే సంగతులంటూ వ్యాఖ్యానించారు. 2019 మహారాష్ట్ర ఎన్నికలను ప్రస్తావిస్తూ.. బీజేపీ, శివసేన విభేదాల కారణంగా శివసేన ఆ పార్టీకి దూరంగా ఉండాలని అనుకుందని, శివసేనను ఖతం చేయడానికి బీజేపీ ప్రయత్నించిందని సంజయ్ రౌత్ విమర్శించారు. బీజేపీతో అంటకాగుతున్న పార్టీలను అంతం చేయాలని అనుకుంటుందని అన్నారు. ఇప్పుడు శివసేనలో తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు, ఎంపీలు అసలు విషయాన్ని గుర్తిస్తున్నారని, ఇలాంటి మొసలికి దూరం కావడం ద్వారా ఉద్ధవ్ ఠాక్రే మంచి నిర్ణయం తీసుకున్నారని అన్నారు.
Also Read
- Abhijit Dipke: "రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి".. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
- CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
- Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
- Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
Read Also: Sai Dharam Tej: చక్రవ్యూహం ట్రైలర్ లాంచ్ చేసిన సుప్రీమ్ హీరో
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చాలా అశాంతి నెలకొందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ మాట నిలబెట్టుకోవడం లేదని, శివసేన ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వడం లేదని, పైగా వారిని అవమానించే ప్రయత్నం చేస్తుందని అన్నారు. దీంతోనే మహారాష్ట్ర, పార్టీ గౌరవం కోసం ఉద్ధవ్ ఠాక్రే ఆ సమయంలో కరెక్ట్ నిర్ణయం తీస్తున్నారని సంజయ్ రౌత్ అన్నారు.
2019 ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసిన బీజేపీ, శివసేన మెజారిటీ సీట్లను సాధించింది. అయితే సీఎం శివసేనకు కావాలని పేచీ పెట్టడంతో బీజేపీ నుంచి విడిపోయి కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కూటమిగా ‘మహావికాస్ అఘాడీ’ పేరుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తరువాత గతేడాది ఏక్ నాథ్ షిండే తిరుగుబాటులో మళ్లీ మెజారిటీ శివసేన ఎమ్మెల్యేలు బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
-
Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
-
Abhijit Dipke: “రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి”.. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!