GVL Narasimha Rao: ప్రపంచ దేశాల నేతలకు బాస్‌లా మారిన మోడీ.. ఐదో బలమైన దేశంగా భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GVL Narasimha Rao: ఏపీకి ప్రత్యేక నిధులు ఇచ్చారు.. పదివేల నాలుగు వందల కోట్లు ఏపీకి ఇచ్చి కేంద్రం తన ఉదారతను చాటుకుందన్నారు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు.. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రపంచ దేశాల నేతలకు బాస్‌లా మోడీ మారారు.. 2014 లో బలహీనమైన దేశాల జాబితాలో ఉండేది… మోడీ నాయకత్వంలో ప్రపంచంలో ఐదవ బలమైన దేశంగా ఎదిగిందని తెలిపారు.. నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ళ పాలన సుభిక్షంగా సాగిందన్న ఆయన.. ఆరున్నర దశాబ్దాల లో భారత దేశం సాధించలేని అద్భుతాలు విజయాలు మోడీ ప్రభుత్వం సాధించిందని తెలిపారు.. కరోనా సమయంలో ఆత్మ నిర్భర భారత్ ద్వారా మన సత్తా చూపించాం.. ప్రపంచానికి మేడ్ ఇన్ ఇండియా వాక్సిన్ అందించామని గుర్తుచేశారు.
Read Also: CM YS Jagan: నిర్మల్ హృదయ్ భవన్‌కు సీఎం దంపతులు.. అనాథ పిల్లలతో ముచ్చట్లు..
Also Read
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్’.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
మొబైల్ ఫోన్ ల తయారీ లో ప్రపంచం లో రెండవ దేశంగా భారత్ ఎదిగిందన్నారు జీవీఎల్.. కోవిడ్ సమయం లో వంద దేశాలకు మందులు అందించిన ఘనత మోడీ ప్రభుత్వానిదేనన్న ఆయన.. ఈ దేశం లో వాక్సిన్ తయారు అవ్వక పోతే కొన్ని కోట్ల ప్రాణాలు ప్రమాదంలో పడేవన్నారు.. రెండున్నరేళ్లలో పార్లమెంట్ ఉభయ సభల భవనాలను నిర్మించిన చరిత్ర మోడీ నాయకత్వనిది.. పది కోట్ల మందికి ఉచితం గా గ్యాస్ కనెక్షన్ లు ఇచ్చాం.. రాబోయే ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీ ఖాయం అన్నారు.. తీవ్రవాద చొరబాట్లు దాడులను అరికట్టిన ప్రభుత్వం మోడీ ప్రభుత్వం.. కొవిడ్ సమయంలో, యుద్ధ సమయంలో విదేశాల నుండి ప్రజలని రక్షించి తీసుకు వచ్చిన ప్రభుత్వం మోడీది అని కొనియాడారు.. గత తొమ్మిదేళ్ళ లో 74 కొత్త ఐర్పోట్ లను నిర్మించాం.. 55 వేల కోట్ల రూపాయల నరెగ నిధులను ఆంధ్ర ప్రదేశ్ కు ఇచ్చాం.. 22 లక్షల ఇళ్లు మంజూరు చేయడం జరిగింది. ఏపీ కి ప్రత్యేక నిధులు ఇచ్చారు అంటూ కేంద్రంపై ప్రశంసలు కురిపించారు.. చారిత్రాత్మక పార్లమెంట్ భవన ప్రారంభానికి రాజకీయ పార్టీల నేతలు రాక పోవడం వాళ్ళ సంకుచిత మనసును తెలియ జేస్తుందని మండిపడ్డారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.
తాజావార్తలు
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్’.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
ట్రెండింగ్
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!