పొలిటికల్ భేటీల నేపథ్యంలో కర్ణాటకలో జేడీఎస్ అధినేత హెచ్‌డీ కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా కుమారస్వామి మాట్లాడుతూ.. జేడీఎస్‌ను విపక్షాలు తమ భాగస్వామిగా భావించడం లేనట్లుంది.. అందుకే తాను విపక్షాల మహాకూటమిలో చేరే ప్రసక్తి లేదని అన్నారు. ఇక, ఇదే టైంలో ఎన్డీయే కూటమి సమావేశంపై కూడా ఆయన హాట్ కామెంట్స్ చేశారు.
వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ కసరత్తులు ప్రారంభించింది. అందుకోసం ఎన్‌డిఎ కుటుంబాన్ని పెంచుకునేందుకు ప్లాన్ చేస్తుంది. రాష్ట్రాలలోని చిన్న పార్టీలను ఏకతాటిపైకి తీసుకువస్తే.. ఎన్డీయేకు ఎక్కువ సీట్లు వస్తాయి. దీంతో కేంద్రంలో వరుసగా మూడోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది.
భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నేతృత్వంలోని ఎన్‌డీఏలో సుహైల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్‌బీఎస్‌పీ) చేరనుంది. ఎన్‌డిఎలో చేరుతున్నట్లు ఎస్‌బీఎస్‌పీ చీఫ్ ఓం ప్రకాష్ రాజ్ భార్ ప్రకటించారు.
విపక్షాల ఐక్యతను బీహార్ సీఎం నితీష్ వదిలేస్తున్నారా.. మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలోకి మళ్లీ చేరబోతున్నారా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి. జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వరసగా భేటీలు చూస్తే కొత్త ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా ఆయన రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ హరివంశ్‌తో భేటీ అయ్యారు. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో పొత్తు, జేడీయూలో చీలక గురించి భయపడుతున్నారా..? అనే రూమర్స్ తెరపైకి వచ్చాయి.
Lok Sabha Election 2024: 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని NDA (నేషనల్ డెమొక్రాటిక్ అలయన్స్)ను అడ్డుకునేందుకు విపక్షాలు కూటమి కట్టేందుకు సిద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ వారం పాట్నా వేదికగా బీహార సీఎం అధ్యక్షతన విపక్షాల సమావేశం జరిగింది.
Sanjay Raut: భారతీయ జనతా పార్టీ(బీజేపీ)పై ఘాటు విమర్శలు చేశారు శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్. శనివారం బీజేపీని మొసలి, కొండచిలువతో పోల్చారు. ఒకరు రోజు ముందు శివసేన ఎంపీ గజానన్ కీర్తీకర్ మాట్లాడుతూ.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి శివసేన పార్టీపై సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని ఆరోపించారు. ఈ ఆరోపణల తర్వాత ఈ రోజు సంజయ్ రౌత్ బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టారు.
New Parliament: మే 28న కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్, వామపక్షాలు, డీఎంకే, ఆప్, టీఎంసీతో సహా 19 పార్టీలు బహిష్కరించాయి.