Daggubati Purandeswari: ఎన్డీఏ కూటమి బీహార్‌లో అద్భుతమైన విజయం సాధించిందని 68 శాతం ఓటింగ్ సాధించడం గొప్ప విశేషమని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. అభివృద్ధి, సంక్షేమం సమపాలల్లో చేసుకుని వెళ్తే విజయాలు ఎలా ఉంటాయో ఇది ఒక నిదర్శనమని ఆమె అన్నారు. బీహార్‌లో నితీష్ కుమార్ దేశంలోనే అత్యధిక సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత ఉందని, బీహార్ ప్రజలు ఎన్డీఏకు మళ్లీ పట్టం కట్టారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ఇవే ఫలితాలు ఎన్డీఏకు రాబోతున్నాయని…
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టించింది. సర్వేల అంచనాలకు మించి సునామీ సృష్టించింది. తిరుగులేని శక్తిగా ఎన్డీఏ కూటమి చరిత్ర సృష్టించింది. ఈ విజయం కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని తీసుకొచ్చింది. కూటమిలో ఉన్న పార్టీలన్నీ ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఎంజాయ్ చేస్తున్నాయి.
Akhilesh Yadav: బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సంచలన విజయం నమోదు చేసింది. 243 సీట్లు ఉన్న బీహార్‌లో ఏకంగా 200+ పైగా సీట్లను సాధించే దిశగా వెళ్తోంది. ఆర్జేడీ-కాంగ్రెస్-కమ్యూనిస్టుల కూటమి ‘‘మహాఘట్బంధన్’’ తుడిచిపెట్టుకుపోయింది. కేవలం 30 స్థానాల్లోనే ఆధిక్యత కనబరుస్తోంది.
Rahul Gandhi: బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించే దిశగా పయణిస్తోంది. మొత్తం 243 సీట్లలో 201 స్థానాల్లో బీజేపీ-జేడీయూ కూటమి ఆధిక్యంలో ఉంది. ప్రతిపక్ష ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి కేవలం 36 స్థానాల్లోనే ఆధిక్యత కనబరుస్తోంది. ఈ దశలో బీజేపీ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై సెటైర్లు వేసింది.
బీహార్ ఎన్నికలకు ముందు అంతన్నారు.. ఇంతన్నారు. తీరా ఫలితాలు వచ్చేటప్పటికీ బొక్కబొర్లా పడ్డారు. ఇదంతా ఎవరి గురించి అంటారా? అదేనండీ.. ఇండియా కూటమి గురించి. ఎన్నికల షెడ్యూల్ రాక ముందు నుంచి తమదే అధికారం అంటూ ప్రచారం చేసుకుంది.
10 Reasons For NDA Grand Victory in Bihar: ఎంతో ఉత్కంఠగా సాగిన హైవోల్టేజ్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో.. ఎన్డీయే కూటమి మరోసారి జయభేరి మోగించింది. ఎగ్జిట్ పోల్ అంచనాలను నిజం చేస్తూ బీహార్ ఓటర్లు నితీశ్ కుమార్‌కు పట్టం కట్టారు. కాంగ్రెస్, ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ ను బీహార్ ప్రజలు తిరస్కరించారు. ఓవైపు వివాదాస్పద ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ, మరోవైపు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఫ్యాక్టర్.. ఇంకోవైపు కుల రాజకీయాలు..…
Bihar Election Results: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించబోతోంది. ఎవరూ ఊహించని విధంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మించి విజయం దిశగా వెళ్తోంది. బీజేపీ, జేడీయూ, ఎల్జేపీల జోడీ బంపర్ హిట్ అయింది. మరోవైపు, కాంగ్రెస్, ఆర్జేడీల కూటమి చతికిత పడింది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో ఎన్డీయే కూటమి 190 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, మహాఘట్బంధన్ కూటమి 50 సీట్ల లోపు పరిమితమైంది.
ఎన్నో ఆశలు.. ఎన్నో ఊహలతో ఎన్నికల కథన రంగంలోకి దిగిన ఆర్జేడీ వ్యూహాలు తల్లకిందులయ్యాయి. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని.. ముఖ్యమంత్రి కావాలని తేజస్వి యాదవ్ ఎన్నో ప్రణాళికలు వేసుకున్నారు.
బీహార్‌లో భారీ విజయం దిశగా ఎన్డీఏ కూటమి దూసుకెళ్తోంది. సర్వేల అంచనాలు కూడా తల్లకిందులై అతి పెద్ద విజయం దిశగా అధికార కూటమి జెట్ స్పీడ్తో దూసుకుపోతుంది.