ద్రౌపది ముర్ము కొత్త చరిత్ర సృష్టించారు.. కనీసం కరెంటు కూడా లేని కుగ్రామంలో పుట్టిన ఆమె.. ఇప్పుడు దేశ అత్యున్నత పదవి చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అసలు ద్రౌపది నేపథ్యం ఏంటి? ఎక్కడ పుట్టారు? రాజకీయాల్లోకి ఎలా వచ్చారు?
రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇప్పటికే ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలుపు లాంఛనమే అని తెలుస్తున్నా.. ఎంత మెజారిటీతో గెలుస్తారనేది ఆసక్తిగా మారింది. గురువారం ఉదయం మొదలైన ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం ఎంపీల ఓట్ల లెక్కింపుతో తొలి రౌండ్ ముగిసింది. ఎంపీల ఓట్ల లెక్కింపులో ద్రౌపది ముర్ము భారీగా ఓట్లను సాధించారు. ద్రౌపది ముర్ము 540 మంది ఎంపీల మద్దతులో 3,78,000 విలువను సాధించారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్టీఏ అభ్యర్థిగా బరిలోకి దిగిన ద్రౌపది ముర్ము.. షెడ్యూల్ ప్రకారం ఇవాళ హైదరాబాద్‌లో పర్యటించాల్సి ఉన్నా.. తన పర్యటనను రద్దుచేసుకున్నారామె.. ముందుగా నిర్ణయించిన ప్రకారం.. ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్‌కి ఆమె చేరుకోవాల్సి ఉంది.. బేగంపేట ఎయిర్ పోర్ట్ లో రాష్ట్రపతి అభ్యర్థికి ఘనస్వాగతం పలికిచేందుకు బీజేపీ నేతలు ఏర్పాట్లు కూడా చేసినట్టు తెలుస్తోంది.. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు సోమజిగూడలోని ఓ హోటల్‌లో మేధావులతో సమావేశం, ఆ…