దేశానికి మరింత సేవ చేయాలని ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారని ప్రధాని మోడీ అన్నారు. రాష్ట్రపతి భవన్‌లో ద్రౌపది ముర్మును ఎన్డీఏ నేతలు భేటీ అయి తీర్మాన పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరగా.. అందుకు అంగీకారం తెలిపింది.
రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో నరేంద్ర మోడీ, ఎన్డీయే మిత్రపక్షాలు సమావేశం అయ్యాయి. ఈ సందర్భంగా ఎన్డీఏ చేసిన తీర్మానాన్ని రాష్ట్రపతికి మోడీ అందజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని రాష్ట్రపతిని మోడీ కోరారు
Supreme Court Upholds Centre's Note Ban Move: పెద్ద నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు ఈ రోజు తీర్పు వెలువరించింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సరైనదే అని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. 2016లో కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసింది ఎన్డీయే ప్రభుత్వం. కేంద్ర నిర్ణయాన్ని తప్పు పడతూ మొత్తం 58 పిటిషన్లు దాఖలు అయ్యాయి. వీటన్నింటిని సోమవారం సుప్రీంకోర్టు కొట్టేసింది. నోట్ల రద్దులో ఎలాంటి లోటుపాట్లు జరగలేదని చెప్పింది.
Supreme Court’s constitution bench verdict on demonetisation on January 2: ఎన్డీయే ప్రభుత్వం 2016లో తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై ఈ రోజు సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించనుంది. సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పును చెప్పనుంది. రూ.500, రూ.1000 కరెన్సీ నోట్లను నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టులో 30కి పైగా పిటిషన్లు దాఖలు అయ్యాయి. డిసెంబర్ 7న సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేయగా.. తాజాగా ఈ రోజు తీర్పును చెప్పనుంది.…
Central Government Jobs in 8 years: ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు జరగడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలపై కీలక ప్రకటన చేసింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పార్లమెంట్ లో మాట్లాడుతూ.. గడిచిన 8 ఏళ్లలో 7.22 లక్షల మందిని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోకి తీసుకున్నామని వెల్లడించారు. 2014-2022 మధ్య ఈ రిక్రూట్మెంట్ జరిగినట్లు బుధవారం పార్లమెంట్ లో…
Central Govt key announcement in Parliament on Jamili election: కేంద్రం జమిలి ఎన్నిలకు నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నట్లు కనిపిస్తోంది. జమిలి ఎన్నికలపై కేంద్రం పార్లమెంట్ లో కీలక ప్రకటన చేసింది. పార్లమెంట్ కు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశం పరిశీలనలో ఉందని తెలిపింది. జమిలి ఎన్నికలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, సీఈసీతో చర్చించామని వెల్లడించింది. అలాగే అనేక భాగస్వామ్య పక్షాలతో చర్చించామని కేంద్రం వెల్లడించింది.
కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను వరుసగా ఎండగడుతూ వస్తున్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్.. తాను ఈ మధ్య ఏ సభలో పాల్గొన్న కేంద్రం విధానాలను తప్పుబడుతున్నారు.. ఇక, సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఆయన.. ట్విట్టర్ వేదికగా కేంద్రంపై యుద్ధం ప్రకటించారు.. వరుస ట్వీట్లతో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.. 30 ఏళ్ల గరిష్టానికి ద్రవ్యోల్బణం అనే ఓ జాతీయ మీడియా కథనాన్ని షేర్ చేసిన మంత్రి కేటీఆర్.. అందులో…
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. మౌలికవసతుల విక్రయానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు.. రూ.6 లక్షల కోట్ల నిధులు సమీకరించడమే లక్ష్యంగా రోడ్ మ్యాప్ ప్రకటించింది. రోడ్లు, విమానాశ్రయలు, గ్యాస్ పైప్లైన్లు విక్రయించే యోచనలో ఉంది కేంద్రం.. వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా.. ఆస్తుల విక్రయాలు చేపడుతోంది. కీలక రంగాలు మినహా మిగతా రంగాలను ప్రైవేటీకరించనున్నట్టు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. నిర్దిష్ట కాలానికి ఆస్తుల అమ్మకం ద్వారా నిధులు సమీకరించనున్నట్టు…