సంచలనం సృష్టించిన స్వాతి హత్య కేసును జాతీయ మహిళా కమిషన్ (NCW) సుమోటోగా తీసుకుంది. కేసు పూర్తి వివరాలు అందించాలని స్థానిక పోలీసులను ఆదేశించింది. ఇప్పటికే నిందితుడు మహేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
కుటుంబ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా తప్పు సరిదిద్దుకున్నాడు. మహిళల దినోత్సవం ముందు కీలక నిర్ణయం తీసుకున్నాడు. జాతీయ మహిళా కమిషన్‌కు లేఖ ద్వారా క్షమాపణ చెప్పాడు. ఇకపై మహిళలను గౌరవిస్తానని.. జరిగిపోయిన దాన్ని మార్చలేమని.. ఇక నుంచి జాగ్రత్తగా ఉంటానని తెలిపారు. ‘ఇండియాస్ గాట్ లాటెంట్’ వేదికగా రణవీర్ అల్హాబాదియా కుటుంబ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇవి దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి.
జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మపై చేసిన వ్యాఖ్యలకు గాను లోక్‌సభ ఎంపీ మహువా మొయిత్రాపై చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు జాతీయ మహిళా కమిషన్ శుక్రవారం తెలిపింది.
Khushbu Sundar: ప్రముఖ సినీనటి, బీజేపీ నేత ఖుష్బూ సుందర్ కు కీలక పదవి లభించింది. జాతీయ మహిళా కమిషన్( ఎన్సీడబ్ల్యూ) సభ్యురాలిగా ఆమెను కేంద్రం నామినేట్ చేసింది. ఆమెతో పాటు మరో ఇద్దరిని నామినేట్ అయ్యారు. బీజేపీ జాతీయ కార్యవర్గం సభ్యురాలు అయిన ఖుష్బూ తన నియామక పత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
పంజాబ్ కాంగ్రెస్ సర్కార్‌లో నెలకొన్ని సంక్షోభానికి తెరదింపేందుకు రంగంలోకి దిగిన కాంగ్రెస్ అధిష్టానం.. కొత్త సీఎంను.. డిప్యూటీ సీఎంనులను సైతం నియమించింది.. ఇక, పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజే కొత్త సీఎం చరణ్‌సింగ్ చన్నీకి భారీ షాకే తగిలింది.. అయితే, అది సొంత పార్టీ నుంచో.. అధిష్టానం నుంచో కాదు.. జాతీయ మహిళా కమిషన్ నుంచి.. విషయం ఏంటంటే..? చరణ్ సింగ్‌పై ‘మీటూ’ అరోపణలు ఉన్నాయి.. 2018లో ఆయనపై మీటూ ఆరోపణలు రాగా.. ఆయన కొట్టిపారేశారు..…