Maharastra: ఎట్టకేలకు మహారాష్ట్ర ఆధిపత్య పోరుకు తెరపడింది. ఆ రాష్ట్రంతో పాటు దేశం మొత్తం ఇదే అంశంపై చర్చించుకుంటున్నారు. ఈ రోజు సుప్రీంకోర్టులో ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి.
తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించే పనిలో బిజీగా ఉన్నారు సీఎం కేసీఆర్. దేశ రాజకీయలను శాసించేందుకు జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టిన కేసీఆర్..దూకుడుగా తమ రాజకీయ ప్రణాళికలను అమలు చేస్తున్నారు
Asaduddin Owaisi: నాగాలాండ్ రాష్ట్రంలో శరద్ పవార్ ఎన్సీపీ పార్టీ, బీజేపీ సంకీర్ణానికి మద్దతు ఇవ్వడంపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు. నాగాలాండ్ ఎన్సీపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి నేఫియు రియోకు మద్దతు ప్రకటించిన తర్వాత అసదుద్దీన్ శరద్ పవార్ పై విమర్శలు గుప్పించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 60 స్థానాలకు గానూ ఎన్డీపీపీ-బీజేపీ పార్టీలు 37 స్థానాలను కైవసం చేసుకున్నాయి.
Sharad Pawar: దేశంలో మార్పు పవనాలు బలంగా వీస్తున్నాయని ఎన్సీపీ నేత శరద్ పవార్ అన్నారు. ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ తన కంచుకోట అయిన కస్బాపేత్ అసెంబ్లీ స్థానాన్ని కోల్పోయింది. దీనిపై మాట్లాడుతూ శరద్ పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు. కస్బా పేత్ ఓటమితో ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారని స్పష్టమైందని ఆయన అన్నారు. దాదాపుగా మూడు దశాబ్ధాలుగా పూణేలోని ఈ నియోజకవర్గం బీజేపీకి కంచుకోటగా ఉంది.
MLA Saroj Ahire: మహారాష్ట్ర మహిళా ఎమ్మెల్యే చంటి బిడ్డతో బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) ఎమ్మెల్యే సరోజ్ అహిరే తన నాలుగు నెలల బిడ్డతో ముంబైలోని మహారాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. సోమవారం నుంచి మహారాష్ట్ర బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి
Ajit Pawar: మహారాష్ట్రలోని పూణెలో జరిగిన లిఫ్ట్ ప్రమాదం నుంచి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత అజిత్ పవార్ తృటిలో తప్పించుకున్నారు. నగరంలోని హార్దికర్ హాస్పిటల్లోని నాల్గవ అంతస్తు నుండి లిఫ్ట్ పడిపోయినప్పుడు ఎన్సీపీ నాయకుడు, మరో ముగ్గురితో కలిసి లిఫ్ట్లో ఉన్నారు. ఈ ప్రమాదంలో వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు మరియు ఎలాంటి గాయాలు కాకుండా లిఫ్ట్ నుండి బయటకు వచ్చారు. అయితే, ఆ విషయం కాస్త ఆలస్యంగా ఆజిత్ పవార్ బయటపెట్టారు.. ఆదివారం బారామతిలో…
Maharashtra MLA Attends Assembly With Her Baby: మహారాష్ట్ర శీతాకాల అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తోంది. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ రోజు నాగ్పూర్లోని మహారాష్ట్ర అసెంబ్లీకి తన రెండున్నర నెలల పాపతో మహిళా ఎమ్మెల్యే వచ్చారు. డియోలాలి నుంచి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ( ఎన్సీపీ ) ఎమ్మెల్యేగా ఎన్నికైన సరోజ్ అహిరే శీతాకాల సమావేశాలకు హాజరయ్యేందుకు చంటి బిడ్డతో వచ్చారు. బిడ్డను చేతిలో పట్టుకుని అసెంబ్లీలో నడుస్తున్న ఎమ్మెల్యే ఫోటోలు సామాజిక…
Aaditya Thackeray Joins Bharat Jodo Yatra, Marches With Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన భారత్ జోడో యాత్రం ప్రస్తుతం మహారాష్ట్రలో జరుగుతోంది. సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ ఈ యాత్రను చేపట్టారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ప్రస్తుతం జోడో యాత్ర మహారాష్ట్రకు చేరింది. యాత్ర ప్రారంభమై 65వ రోజుకు చేరుకుంది. ఇదిలా ఉంటే శుక్రవారం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రంలో శివసేన…
NCP Cheif Shard pawar hospitalized : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆరోగ్యం క్షీణించడంతో ఆయన ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేరారు.