ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారిస్తున్న ఎన్సీబీ అధికారి వాఖండే ఆర్యన్ ను కేసు నుంచి తప్పించడానికి భారీగా డబ్బును డిమాండ్ చేస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనను కేసు నుంచి తొలగించారు. అప్పటి నుంచి ఈ కేసు పలు పలుపులు తిరుగుతోంది. అయితే డబ్బు రికవరీకి సంబంధించి సామ్ డిసౌజా అకా సెన్విల్లే స్టాన్లీ డిసౌజా నేడు ఎంసీబీ సిట్ ముందు హాజరు కానున్నారు. ఆర్యన్…
అక్టోబర్ 21వ తేది, గురువారం దాదాపు నాలుగు గంటల పాటు ఎన్సీబీ అధికారులు బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండేను ఆర్యన్ ఖాన్ తో ఉన్న అనుబంధం, డ్రగ్స్ వాడకంపై తమ కార్యాలయంలో విచారించారు. దానికి ముందు ఆమె సెల్ ఫోన్ ను, లాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్నారు. అలానే ఆర్యన్ తో అనన్య గతంలో చాటింగ్ చేసిన విషయాలను ఎన్సీబీ అధికారులు ఈ సందర్భంగా ఆమె దగ్గర ప్రస్తావించినట్టు తెలుస్తోంది. విశేషం ఏమంటే… ఆర్యన్, అనన్య…
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో భాగంగానే ఈరోజు ఉదయం ఎన్సీబీ నటుడు చుంకీ పాండే కుమార్తె, బాలీవుడ్ నటి అనన్య పాండే ఇంట్లో, షారుఖ్ ఖాన్ ఇంట్లో సోదాలు నిర్వహించింది. తరువాత అనన్య పాండేను విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది ఎన్సీబీ. సాయంత్రం 4 గంటల సమయంలో ఏజెన్సీ కార్యాలయానికి చేరుకున్న అనన్య పాండేను ఇప్పుడు ఎన్‌సిబి ప్రశ్నిస్తోంది. కొన్ని…
బాలీవుడ్ లో డ్రగ్స్ కేసు సంచలనం సృష్టిస్తోంది. షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ గత 14 రోజుల నుండి ఆర్థర్ రోడ్ జైలులో ఉన్నాడు. నిన్న కోర్టులో విచారణకు వచ్చిన ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ ను ధర్మాసనం తిరస్కరించింది. అయితే తాజాగా ఎన్సీబీ బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఇంటిపై దాడులు చేయడం ఆసక్తికరంగా మారింది. నటుడు చుంకి పాండే కూతురు, అనన్య పాండే బాంద్రాలో నివాసం ఉంటున్న ఇంటిపై నార్కోటిక్స్ బ్యూరో కంట్రోల్…
డ్రగ్స్ కేసులో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌కు ముంబై కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆర్యన్‌ఖాన్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. కస్టడీ ముగిసిన తరువాత కోర్టులో హాజరుపరిచింది ఎన్సీబీ.. ఆయన బెయిల్ పిటిషన్ ను కోర్టు పారేస్తూ.. 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. ఆర్యన్ ఖాన్ తో పాటు 7 గురిని.. జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ఆర్యన్ ఖాన్‌ను ఇన్నిరోజులు పాటు విచారించిన అవసరంలేదంటూ ఆయన తరుపున న్యాయవాది చెప్పిన…
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ అండ్ రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ముంబై క్రూయిజ్‌లో డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నందుకు ఆర్యన్ ఖాన్‌ను ఎన్‌సిబి అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం అతను జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో శనివారం రాత్రి గోవా వెళ్లే క్రూయిజ్ లైనర్‌లో జరిగిన పార్టీలో దాడి చేసి 23 ఏళ్ల ఆర్యన్ ఖాన్ తో పాటు మరో ఏడుగురిని అరెస్టు చేసింది.…
డ్రగ్స్ కేసులో ఈరోజు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను ఎన్‌సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 8 మందిని అధికారులు అరెస్ట్ చేశారు. ముంబైలోని 5 ప్రాంతాల్లో ఎన్‌సీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. క్రూయిజ్ రేవ్ పార్టీలో డ్రగ్స్‌తో పట్టుబడ్డ ఆర్యన్ ఖాన్‌ను ఎన్‌సీబీ అధికారులు ఉదయం నుంచి ప్రశ్నించారు. ఆర్యన్ సెల్‌ఫోన్ లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. డ్రగ్స్ పెడ్లర్స్‌తో ఆర్యన్ అనేకమార్లు వాట్సప్ ఛాటింగ్ చేసినట్టుగా…
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) అదుపులోకి తీసుకుంది. ముంబై తీరంలో అధికారులు క్రూయిజ్ షిప్ పై దాడులు నిర్వహించారు. శనివారం రాత్రి జరిగిన రేవ్ పార్టీకి సంబంధించి ఆర్యన్ ఖాన్‌ని ఎన్‌సిబి ప్రశ్నిస్తోంది. ఆర్యన్ ఖాన్‌పై ప్రస్తుతానికి ఎలాంటి ఆరోపణలు లేవని, ఇప్పటి వరకు ఆయనను అరెస్టు చేయలేదని ఎన్‌సిబి జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే తెలిపారు. అక్టోబర్ 2న ముంబై తీరంలో క్రూయిజ్ షిప్‌లో…
బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, నటుడు అర్మాన్ కోహ్లీ మరోసారి చిక్కుల్లో పడ్డారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డ్రగ్స్ కేసులో శనివారం అర్మాన్ ఇంటిపై దాడి చేసింది. ఆనంతరం అతడిని అదుపులోకి తీసుకుంది. గత కొన్ని రోజులుగా ముంబైలో డ్రగ్స్ గురించి ఎన్‌సిబికి సమాచారం అందుతోంది. ఆ తర్వాత ఎన్‌సిబి ఆపరేషన్ ప్రారంభించి దానికి “రోలింగ్ థండర్” అని పేరు పెట్టింది. ‘రోలింగ్ థండర్’ ఆపరేషన్ కింద అర్మాన్ కోహ్లీ ఇంటిపై దాడి చేశారు. అర్మాన్ ఇంట్లో…
టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రముఖ సెలెబ్రిటీల పేర్లు ఇందులో బయటకు వచ్చాయి. 2017 లోనే ఈ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులు రవితేజ, ఛార్మి, రకుల్, రానా, తరుణ్, పూరి జగన్నాథ్, నవదీప్, ముమైత్ ఖాన్, నందు, శ్రీనివాస్ తదితరుల నుంచి శాంపిల్స్ ను సేకరించి డ్రగ్స్ నిర్ధారణ పరీక్ష కోసం ల్యాబ్ కు పంపారు. ఆ తరువాత ఈ కేసులో వేగం తగ్గిపోయింది. తాజాగా ఈడీ సెలెబ్రెటీలకు…