మొత్తనికి ‘తండేల్’ మూవీతో వందకోట్ల వసూళ్ల క్లబ్‌లోకి చేరారు హీరో నాగచైతన్య. తనలోని కొత్త నటుని బయటకు తీసి తిరుగులేని ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకునాడు. ఇక తాజాగా ఆయన మరో భారీ ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారు. ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మించనున్నారు. ‘ఎన్‌సీ 24’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం ఇటివలే లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే.…