దిగ్గజ నటులు రజనీకాంత్, డాక్టర్ ఎం. మోహన్ బాబు కలిసి నటించిన ‘పెద రాయుడు’ చిత్రానికి ముప్పై ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా చెన్నైలో వీరిద్దరూ కలుసుకుని నాటి జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. జూన్ 15, 1995న విడుదలైన ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. సినిమా విడుదలై ముప్పై ఏళ్లు అవుతున్న సందర్భంగా ఇలా చెన్నైలో రజనీకాంత్, మోహన్ బాబు సందడి చేశారు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ ‘కన్నప్ప’ సినిమాను ప్రత్యేకంగా…