ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మంగళవారం పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆయన క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదని తెలుస్తోంది.
ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి సంబంధించి హిండెన్‌బర్గ్ నివేదికపై వివాదం ఇంకా చల్లారలేదు. ఈ అంశం పార్లమెంట్ సమావేశాలను కుదిపేసింది. హిండెన్‌బర్గ్ నివేదికపై చర్చించాలంటూ దేశంలోని విపక్ష పార్టీల నేతలు పట్టుబట్టిన సంగతి తెలిసిందే. విపక్ష పార్టీల ఆందోళనకు శదర్ పవార్ కు చెందిన ఎన్సీపీ కూడా మద్దతు ఇచ్చింది.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) నాయకుడు అజిత్ పవార్ తన మద్దతుదారులతో బిజెపిలోకి వెళ్తున్నారన్న ప్రచారం మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. అజిత్ కు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలతో షిండే- ఫడ్నవీస్ ప్రభుత్వంతో చేతులు కలపాలని భావిస్తున్నట్లు రాజకీయవర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
మహారాష్ట్రంలోని ఎన్సీపీలో అసలు ఏం జరుగుతోంది? ఆపార్టీ సీనియర్ నేత అజిత్ పవార్ వ్యూహాం ఏంటి? ఆయన బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నారా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అజిత్ పవార్ బీజేపీ బాటలో పయనిస్తున్నారని బహిరంగంగానే చెప్పుకుంటున్నారు.
మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ సంకీర్ణ కూటమి కొనసాగుతోంది. ప్రస్తతం ప్రతిపక్షంలో ఉన్న ఈ కూటమి మధ్య చీలిక వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. నాయకుల మధ్య విభేదాల కారణంగా కూటమికి బీటలు వారాయి అని చర్చలు జరుగుతున్నాయి.
ప్రధాని మోదీ డిగ్రీ పట్టా అంశంపై ఇప్పుడు ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంటోంది. ప్రధాని మోదీ విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని ఇటీవల గుజరాత్ కోర్టు స్పష్టం చేసింది.
మహారాష్ట్ర రాజకీయాల్లో కొద్దిరోజులుగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార మార్పిడితో రాజకీయాలు వేడెక్కిన వేళ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) అధినేత శరద్ పవార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తన రాజకీయ పార్టీకి చెందిన అన్ని జాతీయ స్థాయి విభాగాలు, సెల్స్‌ను తక్షణమే రద్దు చేసినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రఫుల్ పటేల్ బుధవారం తెలిపారు.