Supreme Court: తన హత్య కేసు విచారణ జరుగుతున్న సమయంలో ‘నేను బతికే ఉన్నాను’ అంటూ ఓ పిల్లాడు కోర్టు ముందుకు రావడంతో ఒక్కసారిగా న్యాయమూర్తులతో పాటు అంతా షాక్ అయ్యారు. తన హత్య బూటకమని 11 ఏళ్ల బాలుడు ఈ రోజు సుప్రీంకోర్టు బెంచ్ ముందు హాజరయ్యాడు. బాలుడి తండ్రి, తన భార్య తరుపు కుటుంబం తన కొడుకును చంపాడని ఫిర్యాదు చేయడంతో ఈ కేసు మొదలైంది.
బెంగళూరు నగరంలో గత 4 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కురుస్తున్న కుండపోత వర్షాల ధాటికి రాష్ట్రం లో పలు చోట్ల జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. కాగా సోమవారం రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి బెంగళూరు లోని వెస్ట్ డివిజన్ లోని సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్ ఆయుధశాల గోడ కూలిపోయింది.
Uttar Pradesh: 2021 లో సతీష్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కిన కాగజ్ ఈ సినిమా చూసిన వాళ్ళకి మృతక్ లాల్ బిహారీ గురించి పరిచయం అవసరం లేదు. ఆయన బ్రతికి ఉండగానే రికార్డ్స్ లో చనిపోయినట్లు చిత్రీకరించారు. కేవలం అయన ఆస్థి కోసం సొంత మామనే అధికారులకు లంచం ఇచ్చి ఇలా చిత్రీకరించారు. అయితే తాను చనిపోలేదు ప్రాణాలతోనే ఉన్నాను అని నిరూపించుకునేందుకు లాల్ బిహారీకి 19 సంవత్సరాలు పట్టింది. ఈ నేపథ్యంలో ఆయన పేరులో మృతక్…