Lashkar-e-Taiba: భారత్ కు వ్యతిరేకంగా ప్రసంగాలు .. లష్కరే మాజీ కమాండర్ హతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. పాకిస్థాన్‌లో గురువారం గుర్తు తెలియని వ్యక్తులు లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) మాజీ కమాండర్ అక్రమ్ ఖాన్‌ను కాల్చి చంపారు. వివరాలలోకి వెళ్తే.. భారత్ గురించి వ్యతరేకంగా ప్రసంగాలు చేసే అక్రమ్ గాజీ అలియాస్ అక్రమ్ ఖాన్ న్ను పాకిస్థాన్ లోని బజౌర్ జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు గురువారం హత్య చేసారు. కాగా ఇతను తీవ్రవాద సంస్థకు చెందిన ప్రముఖ వ్యక్తి. ఈయన 2018 నుంచి 2020 వరకు LET రిక్రూట్‌మెంట్ సెల్‌కు నాయకత్వం వహించారు. అలానే కొన్ని సంవత్సరాలుగా తీవ్రవాద కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చాడు. ఇక పాకిస్థాన్‌లో భారతదేశం పైన వ్యతిరేకంగా ప్రసంగాలు చేయడంలో ఇతను దిట్ట. కాగా పేరుకు తగ్గట్టే అక్రమ్ అక్రమాలు చేయడంలో ఆరితేరారు.
Read also:World Cup 2023 Final: ప్రపంచకప్ 2023 ఫైనల్ చేరే జట్లు ఇవే!
Also Read
- Indian Ocean: హిందూ మహాసముద్రంపై యుద్ధమేఘాలు..నెక్ట్స్ ఏం జరగనుంది?
- Iran Ceasefire Proposal: ఇరాన్ శాంతి ప్రతిపాదనకు ట్రంప్ నో.. 7 రోజుల కాల్పుల విరమణ ప్లాన్ తిరస్కరణ
- Congo Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు సీనియర్ సైనిక అధికారులతో సహా 14 మంది మృతి
- Trump-Jinping: ఇరాన్‌కు సాయపడడం భావ్యం కాదు.. జిన్‌పింగ్‌కు ట్రంప్ హితవు
ఉగ్రవాద సంస్థలో విధులు నిర్వహిస్తున్న అక్రమ్ ప్రధాన కర్తవ్యం.. అమాయక యువతను తన మాటాలతో మాయచేసి ఉగ్రవాదులుగా మార్చడం. అలా ఉగ్రవాదులుగా మార్చిన యువతను సంస్థలోకి రిక్రూట్ చేసుకుని వాళ్ళతో చట్ట విరుద్ధ కార్యకలాపాలు చేయించడం ఇదే అతను సంస్థలో నిర్వహించే విధి. కాగా గత కొంతకాలంగా ముష్కరులు ఉగ్రవాదులను టార్గెట్ చేస్తున్నారు. గతంలో ఉగ్రవాద సంస్థలో ప్రధాన విధులను నిర్వహిస్తున్న నాయకులను చంపేశారు. అక్టోబర్‌లో పఠాన్‌కోట్ దాడి సూత్రధారి షాహిద్ లతీఫ్‌ను పాకిస్థాన్‌లో కాల్చిచంపారు. అలానే సెప్టెంబర్ లోనూ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని రావల్‌కోట్ లోని అల్-ఖుదుస్ మసీదులో లష్కరే తోయిబాకు చెందిన టాప్ టెర్రరిస్టు కమాండర్ రియాజ్ అహ్మద్ అలియాస్ అబు ఖాసిమ్‌ని గుర్తు తెలియని ముష్కరులు కాల్చి చంపారు.
తాజావార్తలు
-
TGTET Results 2026: తెలంగాణ ఇన్-సర్వీస్ ఫలితాలు విడుదల.. 70 శాతం దాటిన ఉత్తీర్ణత..!
-
Dancers Association Dispute: డాన్సర్స్ అసోసియేషన్‌లో విభేదాలు.. అక్టోబర్ 11న ఎన్నికలు
-
TRAI Internet TV Rules: TRAI కొత్త రూల్స్.. ఇంటర్నెట్లో ఫ్రీగా టీవీ ఛానెళ్లను చూడటం ఇక కష్టమేనా?
-
Nursing Home Seized: వారం రోజుల్లో ఇద్దరు మృతి.. తిరువూరు నర్సింగ్ హోమ్ సీజ్..!
-
DGP CV Anand: గణేశ్ నిమజ్జనాల్లో తీవ్ర విషాదాలు.. తెలంగాణలో ఎస్సై సహా 13 మంది మృతి..
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?