IRCTC: దేశంలోని వివిధ పర్యాటక ప్రాంతాలకు ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. తిరుపతి, షిర్డీ, పూరీ వంటి పుణ్యక్షేత్రాలతో పాటు అండమాన్ దీవులు వంటి పర్యాటక ప్రదేశాలకు కూడా ఐఆర్‌సీటీసీ ప్రత్యేకంగా ప్యాకేజీలను ప్రకటించింది. అందమైన దీవులు చూడాలని భావించేవారికి అండమాన్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. 5 రాత్రులు, ఆరు రోజుల టూర్ ప్యాకేజీతో ఇది ఉంటుందని వివరించింది. హేవ్ లాక్, పోర్టు బ్లెయిర్ వంటి వివిధ ప్రాంతాలు ఈ ప్యాకేజీలో కవర్ అవుతాయి. జనవరి 28…
6 నెలల్లో ఎప్పుడైన ఎన్నికలు రావొచ్చన్న బండి సంజయ్ 6 నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలను జైళ్లకు పంపించే కుట్ర కేసీఆర్ చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల లిస్ట్ నుండి బీజేపీ వాళ్ళ ఓట్లను తొలగించే ప్రయత్నం జరుగుతుంని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు లిస్ట్ ను చెక్ చేసుకోండని, ఓట్లను నమోదు చేసుకోవాలని, మన వల్ల ఓట్లను నమోదు చేయించండని అన్నారు. బీజేపీ రాష్ట్రంలో…
5 drunk men pour hot oil on hotel owner: చెన్నై సమీపంలో ఓ హోటల్ యజమాని, అతని కొడుకు, సిబ్బందిపై ఐదుగురు తాగుబోతులు దాడిచేశారు. అంతటితో ఆగకుండా వేడి నూనెను వారిపై పోశారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రగాయాల పాలయ్యారు. మద్యం మత్తులో ఉన్న నిందితులు ఈ ఘటనకు పాల్పడ్డారు. ప్రస్తుతం నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన చెన్నై శివారులోని సెలైయూర్ సమీపంలోని మాడంబాక్కంలో జరిగింది.
పసిడిని దాటిన మిర్చి రేటు.. ఎనుమాముల మార్కెట్‌లో మిర్చికి రికార్డు ధర మిర్చి ధర కొత్త రికార్డు సృష్టించింది. వరంగల్ జిల్లా ఎనుమాముల మార్కెట్‌లో ఆల్ టైమ్ హై రికార్డులు నెలకొల్పింది. వరంగల్ జిల్లాలో మిర్చి ధర బంగారం రేటు దాటి పోయింది. దేశీ మిర్చి ధర ఏకంగా రూ.80,100 పలికింది. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో దేశీ కొత్త మిర్చి చరిత్రలోనే హై రేట్ నమోదు చేసుకుంది. శుక్రవారం 3 వేల మిర్చి బస్తాలు మార్కెట్…
Yogi Adiyanath: యూపీలోని లక్నోలో వచ్చే నెలలో పెట్టుబడిదారుల సదస్సు జరగనుంది. ఈ సదస్సును ప్రోత్సహించేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ గురువారం నాడు లక్నోకు వచ్చారు. ఈ సందర్భంగా పలువురు బాలీవుడ్ సభ్యులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే యూపీనే గుర్తుకురావాలని సీఎం యోగి వ్యాఖ్యానించారు. యూపీలో వెబ్ సిరీస్ తీస్తే 50 శాతం, ఫిల్మ్ ల్యాబ్‌లు, స్టూడియోలు స్థాపిస్తే 25 శాతం సబ్సిడీ ఇస్తామని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. సమాజాన్ని ఏకం చేయడంలో,…
World Will Benefit If People Of India And China Work Together says Dalai Lama: చారిత్రాత్మకంగా బౌధ్ద దేశమైన చైనా, అహింసా-కరుణ ఆదర్మాలను కలిగిన భారత్ కలిసి పనిచేస్తే ఈ ప్రపంచానికే ప్రయోజనం అని ప్రముఖ బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామా అన్నారు. రెండున్నర బిలియన్ల కంటే ఎక్కువ మంది ఉన్న ఈ రెండు దేశాల ప్రజలు కలిసి పనిచేస్తే ఈ గ్రహం మొత్తానికి మంచిదని ఆయన అన్నారు. ఈ రెండు దేశాలు…
woman opens her eyes en route to crematorium: ఉత్తరప్రదేశ్ లో విచత్ర సంఘటన జరిగింది. చనిపోయిందనుకున్న మహిళ మళ్లీ కళ్లు తెరిచింది. అంత్యక్రియలు చేస్తుండగా ఒక్కసారి కళ్లు తెరవడంతో బంధువులంతా షాకయ్యారు. ఈ ఘటన యూపీలోని ఫిరోజాబాద్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే హరిభేజీ అనే 81 ఏళ్ల మహిళ బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్థారించారు. బ్రెయిన్ హెమరేజ్ తో బాధపడుతున్న సదరు వృద్ధరాలు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో బంధువలంతా అంత్యక్రియలకు…
Supreme Court: థియేటర్లలోకి బయటి ఫుడ్ తీసుకెళ్లే విషయంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రేక్షకులు థియేటర్లకు బయటి ఫుడ్ తీసుకురావడంపై యాజమాన్యాలు ఆంక్షలు పెట్టడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. థియేటర్లు ప్రైవేట్ ప్రాపర్టీ కావడం పట్ల యాజమాన్యం నిబంధనలు పెట్టుకోవచ్చని కోర్టు సూచించింది. శిశువుల కోసం తల్లిదండ్రులు తీసుకెళ్లే ఆహారంపై మాత్రం ఎలాంటి ఆంక్షలు పెట్టడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ మేరకు చీఫ్ జస్టీస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.…
Indian Railways: 2021తో పోలిస్తే 2022లో భారతీయ రైల్వేలకు భారీగా ఆదాయం సమకూరింది. 2022 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య ప్రయాణికుల నుంచి వచ్చే ఆదాయం గణనీయంగా పెరిగింది. ఈ మేరకు 71శాతం వృద్ధి కనబరిచిందని రైల్వేశాఖ వెల్లడించింది. 2022 ఏప్రిల్ నుంచి 2022 డిసెంబర్ మధ్య కాలంలో కేవలం ప్రయాణికుల నుంచి రూ.48,913 కోట్ల ఆదాయం వచ్చిందని రైల్వే శాఖ ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో కేవలం రూ.28,569 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చిందని…