CM Omar Abdullah: జమ్మూ అండ్ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శుక్రవారం పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (PDP) అధినేత్రి మేబూబా ముఫ్తీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ నేత సజ్జాద్ లోన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని ఉద్యోగ నియామకాలపై రిజర్వేషన్ అంశాన్ని గతంలో తమ వద్ద అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు లేవనెయ్యలేదంటూ విమర్శలు గుప్పించారు. సీఎం మీడియాతో మాట్లాడుతూ.. మేబూబా ముఫ్తీకి ఓట్లు కావాలనుకున్నప్పుడు, పార్టీ సభ్యులు రిజర్వేషన్ గురించి మాట్లాడొద్దని అన్నారు. అనంత్‌నాగ్ లో ఎన్నికల సమయంలో రాజౌరి, పూంఛ్ వలయాల నుంచి ఓట్లు కోరారు. కానీ, రిజర్వేషన్ గురించి నోరు విప్పలేదన్నారు.
మేము ప్రభుత్వ గృహాల నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. మా భద్రతను తగ్గించారు. కానీ, సజ్జాద్ లోన్ ప్రభుత్వ నివాసంలో వుండిపోయారు. ఆయన అప్పుడేమి మాట్లాడలేదు.. ఇప్పుడేం మాట్లాడతారు? అని ఎద్దేవా చేశారు. తాము అధికారంలో ఉన్న సమయంలో కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్‌ను 6 నెలల్లో సమర్పించామని, ఇది చరిత్రలో మొదటిసారి అని పేర్కొన్నారు. నాకైతే ఆలస్యం చేయాల్సి ఉంటే మరో 6 నెలలు తర్వాత ఇచ్చేవాడిని. కానీ, అనవసరంగా ఆలస్యం ఎందుకుని? కేబినెట్ ఆ నివేదికను ఆమోదించి లా డిపార్ట్‌మెంట్‌కు పంపిందని వివరించారు.
Read Also: New Traffic Rules: త్వరలో హైదరాబాద్లో కొత్త ట్రాఫిక్ రూల్స్.. డ్రోన్ల ద్వారా ట్రాఫిక్ నియంత్రణ!
ఇండస్ జలాల వ్యవస్థ నుంచి పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌లకు నీటిని మళ్లించేందుకు ప్రతిపాదిత 113 కి.మీ. కాల్వ విషయమై ఒమర్ అబ్దుల్లా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. మా ప్రాంతంలోనే పొడిబారిన వాతావరణం ఉంది. ముందు మేము మా అవసరాలకు నీరు వాడుకోవాలి. పంజాబ్‌కు ఇప్పుడే ఎందుకు ఇవ్వాలి? వారు మనకు నీరు ఇచ్చారా? అని ప్రశ్నించారు. అలాగే రాష్ట్ర హోదా పునరుద్ధరణపై ప్రశ్నించగా, ఇది ప్రధాని మోదీ ఇచ్చిన హామీ. మేము ఆ హామీకి ఎదురు చూస్తున్నాం. న్యాయపరమైన మార్గంలో పోరాటం కొనసాగుతుంది అని అన్నారు.
Read Also: Ahmedabad Plane Crash: 220 మృతదేహాలకు డీఎన్‌ఏ మ్యాచింగ్.. 202 మృతదేహాలు కుటుంబాలకు అప్పగింత..!
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలపై మాట్లాడిన ఆయన, ఇజ్రాయెల్ చర్యలు ఏమిటని ప్రశినించారు. అక్కడ చిక్కుకుపోయిన భారత విద్యార్థుల విషయంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్‌కు అణుశక్తి కార్యక్రమం లేదని ఇటీవలే అన్నారు. అయితే ఇప్పుడేమిటి లక్ష్యంగా చేస్తారు? ఇప్పటికే జమ్మూ అండ్ కాశ్మీర్‌కు చెందిన 400 మంది విద్యార్థులను రక్షిత ప్రాంతాలకు తరలించారు. మొత్తం 1600 మంది అక్కడే ఉన్నారని వివరించారు.
అబ్దుల్లా నాయకత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ప్రజలతో సంబంధాన్ని బలోపేతం చేసేందుకు జమ్మూ నగరంలో కొత్త రబితా కార్యాలయాన్ని ప్రారంభించింది. కశ్మీర్‌లోని రబితా కార్యాలయం మంచి ప్రతిస్పందన పొందింది. అందువల్ల జమ్మూలో కూడా ప్రారంభించాము. ప్రజలు తమ సమస్యలను ఆన్‌లైన్ లేదా ప్రత్యక్షంగా చెప్పొచ్చు. వీలైనంత త్వరగా పరిష్కారం అందించేలా కృషి చేస్తాం అని అన్నారు.