భారత్‌తో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024 తొలి టెస్ట్ మ్యాచ్‌కు ఆస్ట్రేలియా జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. 13 మందితో కూడిన జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది. మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను ఎవరు ఆరంభిస్తారనే ప్రశ్నకు సమాధానం దొరికేసింది. ఇటీవల భారత్-ఎతో అనధికార టెస్టులో ఓపెనర్‌గా రాణించిన నాథన్ మెక్‌స్వీనీ టీమిండియాపై అరంగేట్రం చేయనున్నాడు. మెక్‌స్వీనీ భారత్-ఏపై రెండు ఇన్నింగ్స్‌ల్లో 39, 88 పరుగులు చేశాడు. అంతకుముందు ఆస్ట్రేలియా దేశవాళీ ఫస్ట్‌క్లాస్ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్…
భారత్‌తో సొంతగడ్డపై ఐదు టెస్టుల సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా సిద్ధమవుతోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా తొలి టెస్టు పెర్త్ వేదికగా నవంబర్ 22 నుంచి ఆరంభం కానుంది. ఐదు మ్యాచుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టుకు మాత్రమే క్రికెట్ ఆస్ట్రేలియా తన జట్టును ప్రకటించింది. 13 మందితో కూడిన జట్టును శనివారం వెల్లడించింది. ఆసీస్ జట్టులోకి ఓ కొత్త ప్లేయర్ వచ్చాడు. భారత్-ఏతో అనధికారిక టెస్టుల్లో ఆస్ట్రేలియా-ఏకు సారథ్యం వహించిన నాథన్ మెక్‌స్వీనేకు అవకాశం దక్కింది.…