ప్రపంచమంతా ఉత్కంఠతతో ఎదురుచూస్తున్న సుధీర్ఘ విరామానికి తెరపడింది. భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి తిరిగి వచ్చింది. బుచ్ విల్మోర్ కూడా ఆమెతో తిరిగి వచ్చాడు. బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు క్యాప్సూల్స్ ఫ్లోరిడా తీరంలో విజయవంతంగా ల్యాండింగ్ అయ్యింది. ఇద్దరు వ్యోమగాములతో స్పేస్‌ఎక్స్ క్రూ-9 భూమికి తిరిగి వచ్చింది. అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి తిరిగి రావడానికి 17 గంటలు పట్టింది. క్యాప్సుల్స్ సముద్ర జలాల్లో సురక్షితంగా దిగింది. నాసా సిబ్బంది…
నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతరిక్షం నుంచి భూమ్మీదకు బయల్దేరింది. మరికొన్ని గంటల్లో ఆమె భూమ్మీద ల్యాండ్ కాబోతుంది. ఆమెతో పాటు మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ కూడా రానున్నారు. ఇటీవల అంతరిక్షంలోకి వెళ్లిన పలువురు కూడా వారితో వస్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను నాసా లైవ్ షో ఏర్పాటు చేసింది.
ప్రపంచమంతా ఉత్కంఠతతో ఎదురుచూస్తున్న విషయం ఏదైనా ఉందంటే అది సునీతా విలియమ్స్ తిరిగి భూమి మీదకు చేరడమే. 9 నెలల నిరీక్షణకు తెరుపడనున్నది. భారతీయ అమెరికన్ వ్యోమగామి సునీతా రేపు భూమి మీదకు రానున్నది. దాదాపు తొమ్మిది నెలలు అంతరిక్షంలో గడిపిన తర్వాత సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భారతకాలమానం ప్రకారం రేపు భూమికి తిరిగి వస్తారు. వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ బుధవారం తెల్లవారుజామున భూమికి తిరిగి వస్తారని నాసా ప్రకటించింది. విలియమ్స్, విల్మోర్…
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో చిక్కుకున్న భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి తిరిగి రానున్నారు. అమెరికన్ అంతరిక్ష సంస్థ NASA- SpaceX ఆమెను, వ్యోమగామి బుచ్ విల్మోర్‌ను తిరిగి తీసుకురావడానికి ప్రయోగాన్ని ప్రారంభించాయి. స్పేస్‌ఎక్స్ శనివారం ఉదయం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కు క్రూ-10 మిషన్‌ను ప్రయోగించింది. క్రూ డ్రాగన్ క్యాప్సూల్‌ను మోసుకెళ్లే స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ శనివారం ఉదయం 4.33 గంటలకు విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం ద్వారా…