Sunita Williams: 9 నెలల నిరీక్షణకు తెర.. సునీతా విలియమ్స్ వచ్చేస్తోంది..
- 9 నెలల నిరీక్షణకు తెర
- సునీతా విలియమ్స్ వచ్చేస్తోంది
- సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భారతకాలమానం ప్రకారం రేపు భూమికి తిరిగి వస్తారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచమంతా ఉత్కంఠతతో ఎదురుచూస్తున్న విషయం ఏదైనా ఉందంటే అది సునీతా విలియమ్స్ తిరిగి భూమి మీదకు చేరడమే. 9 నెలల నిరీక్షణకు తెరుపడనున్నది. భారతీయ అమెరికన్ వ్యోమగామి సునీతా రేపు భూమి మీదకు రానున్నది. దాదాపు తొమ్మిది నెలలు అంతరిక్షంలో గడిపిన తర్వాత సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భారతకాలమానం ప్రకారం రేపు భూమికి తిరిగి వస్తారు. వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ బుధవారం తెల్లవారుజామున భూమికి తిరిగి వస్తారని నాసా ప్రకటించింది. విలియమ్స్, విల్మోర్ నిక్ హేగ్, రోస్కోస్మోస్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్‌లతో కలిసి స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్‌లో తిరిగి వస్తారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్‌ఎక్స్ క్రూ భూమికి తిరిగి రావడాన్ని నాసా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
Also Read:Off The Record: నంద్యాల జిల్లా టీడీపీలో పీక్స్‌కు గ్రూప్ వార్..! మంత్రులు వర్సెస్ భూమా ఫ్యామిలీ..?
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
- Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
క్రూ డ్రాగన్ వ్యోమనౌక హ్యాచ్ మూసివేత భారతకాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8.15కు ప్రారంభమవుతుంది. 10.15 గంటలకు ఐఎఎస్ నుంచి విడిపోతుంది. బుధవారం తెల్లవారుజామున 2.40గంటలకు భూవాతావరణంలోకి ప్రవేశిస్తుంది. తెల్లవారుజామున 3.27 గంటలకు సముద్రజలాల్లో క్రూ డ్రాగన్ ల్యాండ్ అవుతుంది. కాగా గతేడాది జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక ‘స్టార్‌లైనర్’లో సునీత, విల్మోర్‌లు ఐఎస్‌ఎస్‌కు చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం వారం రోజులకే సునీత, విల్మోర్ భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాముల తిరుగు ప్రయాణం సాధ్యపడలేదు.
తాజావార్తలు
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!