ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ ఎపిసోడ్ రోజుకో మలుపులు తిరుగుతోంది. నర్సీపట్నంలో టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ఇంటి దగ్గర గోడ కూల్చివేత ఘటనలో హైడ్రామా చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. రాత్రి పూట కూల్చివేతలపై కోర్టు వ్యాఖ్యలకు సీఎం జగన్ ఏం సమాధానం చెపుతారు? అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. తప్పు చేసిన అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. అయ్యన్నది కబ్జా కాదు.. ఇడుపులపాయలో వైఎస్ కుటుంబం చేసింది కబ్జా. ఇడుపులపాయలో వైఎస్ కుటుంబం 600 ఎకరాల దళితుల…
టీడీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి ఇంటి గోడ కూల్చిన వ్యవహారం పైన టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశం పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ స్పందించారు. జగన్.. ఇవాళ నీది.. రేపు మాది గురుపెట్టుకో అంటూ మండిపడ్డారు. జగన్.. మా ఇంటి గోడలు పడగొడుతున్నావ్.. తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదులుతున్నాయి గుర్తుంచుకో అంటూ హెచ్చరించారు. తన ఇంటి పునాదులు కదులుతుండడంతో జగన్ టీడీపీ నేతల ఇళ్లని కూలుస్తున్నారని…
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో కరెంట్ కోతలు అధికంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఎన్టీఆర్ ప్రభుత్వాస్పత్రిలో జనరేటర్ కూడా పనిచేయడం లేదు. దీంతో అర్ధరాత్రి 11 గంటల సమయంలో కృష్ణదేవిపేట నుంచి వచ్చిన ఓ గర్భిణీ పురిటినొప్పులతో బాధపడింది. కరెంట్ లేకపోవడంతో సెల్‌ఫోన్ లైట్ల మధ్యనే వైద్యులు ఆమెకు డెలివరీ చేశారు. ఆ సమయంలో గ్రామంలో ఆస్పత్రి స్టాఫ్‌కు కొవ్వొత్తులు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ప్రసూతి విభాగంలో ఉన్న చంటిబిడ్డ తల్లులు, అప్పుడే పుట్టిన పిల్లలు…
రోడ్లమీద వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ నియమాలు పాటించాలి. హెల్మెట్ పెట్టుకుని నడుపుతున్నా ఒక్కోసారి పోలీసులు ఆపి, తనిఖీలు చేస్తుంటారు. వాహన దారులంటే పోలీసులకు ఎంత అలుసో విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఓఘటన నిరూపించింది. తనిఖీలు చేసే సమయంలో వారికి ఎదురు చెబితే ఎంతకైనా తెగిస్తారనే విషయం అందరికీ తెలిసిందే.. బైక్ ఆపేవరకు ఉండకుండా నేరుగా అడ్డుగా రావడం, తాళాలు తీసుకెళ్లడం చేస్తుంటారు… ఇది ఏంటని ప్రశ్నిస్తే, రుబాబు చేస్తున్నారంటూ లాఠీకి పని చెబుతుంటారు. నర్సీపట్నం మున్నిపాలిటీ బలిఘట్టంలో ఆదివారం…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు గంజాయి గమ్మత్తుగా చిత్తు చేస్తోంది. రాజకీయాల్లో మాటల మంటలకు అదే కారణం అని చెప్పకతప్పదు. గుజరాత్‌లో దొరికిన మత్తు పదార్ధాల దగ్గర్నించి.. నిత్యం విశాఖ, ఏవోబీలో పట్టుబడే గంజాయి వరకూ అంతా రాజకీయ నేతల మధ్య వాగ్వాదానికి కారణం అవుతోంది. ఇదంతా ఒక ఎత్తయితే.. గంజాయిని సాగుచేసే రైతులు అనుసరిస్తున్న విధానాలు ఔరా అనిపించకమానవు. ఇటీవల కాలంలో గంజాయి రవాణాపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాపారులు కొత్త విధానాలు అవలంభిస్తున్నారు… ఇంతవరకు వ్యాపారస్తులే…