వాటెన్ ఐడియా.. గంజాయి సాగులో నయా ట్రెండ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు గంజాయి గమ్మత్తుగా చిత్తు చేస్తోంది. రాజకీయాల్లో మాటల మంటలకు అదే కారణం అని చెప్పకతప్పదు. గుజరాత్‌లో దొరికిన మత్తు పదార్ధాల దగ్గర్నించి.. నిత్యం విశాఖ, ఏవోబీలో పట్టుబడే గంజాయి వరకూ అంతా రాజకీయ నేతల మధ్య వాగ్వాదానికి కారణం అవుతోంది. ఇదంతా ఒక ఎత్తయితే.. గంజాయిని సాగుచేసే రైతులు అనుసరిస్తున్న విధానాలు ఔరా అనిపించకమానవు.
ఇటీవల కాలంలో గంజాయి రవాణాపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాపారులు కొత్త విధానాలు అవలంభిస్తున్నారు… ఇంతవరకు వ్యాపారస్తులే నేరుగా ఏజెన్సీకి వచ్చి కొనుగోలు చేసేవారు. ఈ క్రమంలో దాడులు జరిగితే నేరుగా వారిపై కేసులు నమోదవుతున్నాయి. వీటి నుంచి తప్పించుకునేందుకు వ్యాపారులు కొత్త విధానాలను తెరపైకి తెచ్చారు. ప్రస్తుతం గంజాయిని సాగుచేసే రైతులే నేరుగా వ్యాపారులు చెప్పిన చోటుకు అప్పజెప్పేవిధంగా ఒప్పందం చేసుకుంటున్నారు.
Also Read
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
తాజాగా జరిగిన ఉదంతమే దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. గురువారం నర్సీపట్నం మండలం, గబ్బాడ వంతెన వద్ద పట్టుకున్న గంజాయి అక్రమ రవాణాలో రైతులే నేరుగా తరలిస్తూ పట్టుబడడం పోలీసులను ఆశ్చర్య చకితుల్ని చేసింది. ఈ ఘటనలో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులను చూసి, నర్సీపట్నం వైపు వస్తున్న ఐషర్ వ్యాన్ లో వున్న ఐదుగురిలో, ముగ్గురు వ్యక్తులు పరారయ్యారు. మిగిలిన ఇద్దరైన పాంగి రవి, కిముడు రాజేంద్రలను పట్టుకొని పోలీసులు ప్రశ్నించారు.
తమ పొలంలో తాము పండించిన గంజాయిని నేరుగా వ్యాపారస్తులకు అప్పగించి, నగదు తీసుకునే విధంగా ఒప్పందం చేసుకున్నామని వివరించారు. దీనిలో భాగంగా చేపల మేత మొక్కజొన్నల మాటున గంజాయిని రవాణా చేస్తున్నట్టు వివరించారు.
ఈ ఘటనలో 1,720కిలోల గంజాయిని పట్టుకున్న నర్సీపట్నం రూరల్ పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేసి, వ్యాన్ సీజ్ చేశారు. ఇలాంటి రవాణా విధానం వల్ల వ్యాపారస్తులు తప్పించుకోవడం, పండించిన రైతులే కటకటాల పాలవడం జరుగుతుంది.
తాజావార్తలు
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Attahaasam : వెంకటేష్ మహా కమర్షియల్ సినిమా అట్టహాసం.. హిట్టు కొడతాడో లేదో
-
Mandhana-Harmanpreet: హర్మన్‌ప్రీత్, మంధాన మధ్య విభేదాలు.. రెండుగా విడిపోయిన భారత డ్రెస్సింగ్ రూమ్?
-
Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
ట్రెండింగ్
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!