ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించిన డిగ్రీ అంశంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి మాటల దాడిని పెంచారు. దేశానికి నకిలీ డిగ్రీ ఉన్న ప్రధానమంత్రి అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్హతలపై మరోసారి పరోక్షంగా విరుచుకుపడ్డారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు హైదరాబాద్లో పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఉదయం 11.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. తెలంగాణలో రూ.11,300 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ నగరానికి రానున్న నేపథ్యంలో వినూత్న రీతిలో స్వాగతం పలుకుతూ ప్లెక్సీలు వెలిశాయి. ఇవాళ మధ్యాహ్నం ప్రధాని మోడీ హైదరాబాద్ కు రానున్నారు. దీంతో 'పరివార్ వెల్కమ్స్ యు మోడీ జీ’ అంటూ.. బీజేపీ నేతలు, వారి వారసుల ఫోటోలతో కూడిన పెద్ద ఫ్లెక్సీలు పెట్టారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ గురువారం బీజేపీలో చేరారు. బీజేపీ నేతలు పీయూష్ గోయల్, వి మురళీధరన్, బిజెపి కేరళ రాష్ట్ర చీఫ్ కె సురేంద్రన్ సమక్షంలో అనిల్ ఆంటోనీ బీజేపీలో చేరారు.
అదానీ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ జరిపించాలన్న ప్రతిపక్షాల డిమాండ్పై దృష్టి మళ్లించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్య సూత్రాలపై నడుచుకోవడం లేదని, పార్లమెంటులో అంతరాయాలకు కారణమైందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు.
PM Modi: భగవాన్ హనుమాన్ స్పూర్తితో దేశంలోని అవినీతి, బంధు ప్రీతి, వారసత్వ రాజకీయాలు, శాంతిభద్రతల సవాళ్లపై పోరాడలని బీజేపీ కృతనిశ్చయంతో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బీజేపీ 44వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గురువారం ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. బీజేపీ హనుమంతుడిలా దేశం కోసం ధృడసంకల్పం, దేశ సంక్షేమం కోసం కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు కూడా వెనకాడబోమని, పార్టీ కార్యకర్తలు త్యాగం, అంకితభావంతో పనిచేయాలని ఆయన సూచించారు.
కాంగ్రెస్ మాజీ నాయకుడు, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డిపిఎపి) చీఫ్ గులాం నబీ ఆజాద్ ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించారు. ప్రతిపక్ష నాయకుడిగా తనపై ఏం చేసినా ప్రతీకారం తీర్చుకోకుండా, రాజనీతిజ్ఞుడిగా ఉన్నందుకు ఆయనకు క్రెడిట్ తప్పక ఇవ్వాలని అన్నారు.
PM Modi: బీజేపీ ఎక్కువ ఎన్నికల్లో గెలిస్తే, ప్రతిపక్షాల నుంచి మరిన్ని నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుందని బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఏప్రిల్ 6న పార్టీ వ్యవస్థాపక దినోత్సవం నుంచి ఏప్రిల్ 14 బీఆర్ అంబేద్కర్ జయంత్రి మధ్య సామాజిక న్యాయ వార్షికోత్సవం కోసం సమాయన్ని కేటాయించాలని ఎంపీలను ప్రధాని కోరారు. బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టి 9 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా తొమ్మిదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మే 15 నుంచి…