మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు దాడి చేసిన నేపథ్యంలో.. ఇవాళ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది తెలుగుదేశం పార్టీ.. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. టీడీపీ నేతలపైనే కేసు నమోదు చేశారు మంగళగిరి పోలీసులు.. టీడీపీ కార్యాలయానికి వచ్చిన సీఐ నాయక్ పై దాడి చేశారంటూ మంగళగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.. ఈ కేసులో.. ఏ1గా నారా లోకేష్, ఏ2గా అశోక్ బాబు, ఏ3గా ఆలపాటి…
ఏపీలో టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ ఈ రోజు చంద్రబాబు ఏపీ బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఓవైపు టీడీపీ నేతలు వైసీపీ సర్కార్ తీరుపై దుమ్మెత్తిపోస్తుంటే.. మరోవైపు వైసీపీ నేతలు సీఎం గురించి ఎవరూ అనుచితంగా మాట్లాడినా సహించేది లేదంటున్నారు. ఇదిలా ఉంటే.. ట్విట్టర్ వేదికగా నారా లోకేష్.. ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇప్పటివరకు ముఖ్యమంత్రి అని గౌరవించి గారూ అనేవాడినని, నీ వికృత, క్రూర…
ఏపీలో టీడీపీ నేతల ఇళ్లు, పార్టీ కార్యాలయాలపై అధికార పార్టీ దాడులు చేయడాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. ఇప్పటివరకు జగన్ అంటే ముఖ్యమంత్రి అని గౌరవం ఉండేదని, కానీ ఆయన వికృతి బుద్ధి చూశాక సైకో, శాడిస్ట్, డ్రగిస్ట్ అని అంటున్నానని లోకేష్ వ్యాఖ్యానించారు. ఆనవాయితీలను తుంగలో తొక్కి ప్రజాస్వామ్యానికి పాతరేసి జగన్ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నాడని లోకేష్ ఫైరయ్యారు. ఆయన పతనానికి ఆయనే ఒక్కో ఇటుక పేర్చుకుంటున్నారని మండిపడ్డారు.…
ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ సర్కార్, సీఎం వైఎస్ జగన్పై విద్యుత్ సంక్షోభం విషయంలో సెటైర్లు వేశారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. రాష్ట్రాన్ని అంధకారాంధ్రప్రదేశ్ గా మార్చేశారని ఫై అయిన ఆయన.. ఫ్యాన్కి ఓటేస్తే ఇంట్లో ఉన్న ఫ్యాన్ ఆగిపోయింది అంటూ ఎద్దేవా చేశారు.. ఒక పక్క విద్యుత్ ఛార్జీల పెంపు పేరుతో బాదుడే బాదుడు.. మరోపక్క విద్యుత్ కోతలతో అంధకారం అని ఆవేదన వ్యక్తం చేశారు. బొగ్గు కొరత ఏర్పడుతుంది జాగ్రత్త పడండని.. 40 రోజుల…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు లేఖ రాశారు టీడీపీ నేత నారా లోకేష్.. తొలగించిన ఆప్కాస్ ఉద్యోగుల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని లేఖలో కోరిన ఆయన.. 20 నెలల జీతాల బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.. పాదయాత్ర చేస్తూ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నేనున్నాను.. నేను మీ గోడు విన్నాన్నారు.. మీ మాటలు నమ్మి ఓట్లేసిన ఆ ఉద్యోగులంతా మీరు సీఎం కాగానే.. వాళ్లకిచ్చిన హామీలన్నీ నెరవేర్చుతారని ఆశ పెట్టుకున్నారు.. కానీ, మీరు సీఎం…
ఏపీ సీఎం వైఎస్ జగన్కు తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ లేఖ రాశారు. పెంచిన విద్యుత్ ఛార్టీల కారణంగా వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని, వారిపై మోయలేని భారం పడిందని నారా లోకేష్ లేఖలో పేర్కొన్నారు. ట్రూఅప్ ఛార్జీలు తక్షణమే ఉపసంహరించుకోవాలని లోకేష్ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో కుప్పకూలిన విద్యుత్ రంగాన్ని అత్యవసరంగా గాడిన పెట్టాలని, సీఎం ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు కరెంట్ ఛార్జీలు పూర్తిగా తగ్గిస్తామని ప్రతీ సభలో చెప్పారని లేఖలో పేర్కొన్నారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో…
చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కు తెలుగు తమ్ముళ్లు వరుసగా ఆహ్వానాలు పంపుతున్నారు. తమ జిల్లాల్లో పర్యటనలు చేయాలని కోరుతున్నారట. దీనికి ఆయన కూడా సానుకూలత వ్యక్తం చేస్తూ జిల్లా పర్యటనలకు వస్తానని వారందరికీ అభయం ఇస్తున్నారట. అయితే దీని వెనుక అసలు కారణం వేరే ఉందనే చర్చ టీడీపీలోనే జోరుగా సాగుతోంది. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే నారా లోకేష్ ను టీడీపీ నేతలు మచ్చిక చేసుకుని సీటును…
డ్రగ్స్ వ్యవహారంలో కూడా ఆంధ్రప్రదేశ్లో పాలక, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది… తాజాగా వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చిన టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్… డ్రగ్స్ బిగ్ బాస్ ఎవరూ అంటే బ్రోకర్ సజ్జల ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు? అంటూ ప్రశ్నించారు.. మా నాన్న మారిషస్-నేను దుబాయ్ అంటూ బొంబాయి కబుర్లు మాని, డ్రగ్స్ మాఫియా కింగ్ పిన్ జగన్ బినామీ ద్వారంపూడి…
డ్రగ్స్ వ్యవహారంలో ఏపీలోని అధికార, ప్రతిపక్ష నేతల మధ్య ఆరోపణలు, విమర్శల పర్వం కొనసాగుతోంది.. అయితే, ఈ వ్యవహారంలోకి చంద్రబాబు ఫ్యామిలీని లాగుతోంది వైసీపీ.. చంద్రబాబు కుటుంబం డ్రగ్స్ బిజినెస్సులోకి దిగిందేమోననే అనుమానం వస్తోంది అంటూ హాట్ కామెంట్లు చేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి… పెద్ద ఎత్తున హెరాయిన్ పట్టుబడిన ఈ సందర్భంలో లోకేష్ ఎక్కడున్నారు..? అని ప్రశ్నించిన ఆయన.. లోకేష్ దుబాయ్లో ఉన్నారని మాకు సమాచారం ఉందన్నారు. తమ డబ్బులను విదేశాల్లో దాచిన…
వైసీపీ ప్రభుత్వంపై నారా లోకేష్ మరోసారి సీరియస్ అయ్యారు. వైసీపీ పాలనలో దళితులకు రక్షణ లేదని ఫైర్ అయ్యారు నారా లోకేష్. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం గ్రామసభలో సీజేఎఫ్ఎస్ భూములకు సంబంధించి సరైన పత్రాలు లేకున్నా ఆమోదించాలంటూ ఒత్తిడి తెచ్చినా అంగీకరించలేదనే అక్కసుతో దళిత సర్పంచ్ మాచర్ల పై వైసీపీ నేతలు, వాలంటీర్ కలిసి దాడి చేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఒళ్లు బలిసి దళితుల పై…