విజయనగరం జిల్లాలోని ఎన్సీఎస్ షుగర్స్ ఫ్యాక్టరీ ముందు రైతులు తమకు రావాల్సి బకాయిల కోసం నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో రైతుల ఆందోళనను విరమింపజేయడానికి ప్రయత్నించడంతో పోలీసులకు, రైతులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీనిపై స్పందించిన టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. ప్రజలైనా, ప్రతి పక్షమైనా, చివరికి అన్నదాతలనైనా ప్రశ్నిస్తే.. ప్రభుత్వం నిర్ధాక్షిణ్యంగా అణిచివేస్తోందని అన్నారు. Read Also : ఎయిర్‌పోర్ట్‌లో పట్టుబడ్డ 400 సంవత్సరాల గణపతి విగ్రహం అంతేకాకుండా చెరకు రైతులపై ప్రభుత్వం…
చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ అందరూ హైదరాబాద్ లో ఉంటూ ఇక్కడికి విహార యాత్రకు వస్తున్నారు అని వైసీపీ ఎంపీ నందిగం సురేష్ అన్నారు. ప్రజలు వీళ్ళను రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తులుగా భావిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ ఓట్లు కూడా హైదరాబాద్ లోనే ఉన్నాయి. జగన్ ఓటు పులివెందులలో ఉంది. ఇక బద్వేల్ ఫలితాలతో చంద్రబాబు మైండ్ బ్లాంక్ అయ్యింది అని తెలిపారు. ఈ పాదయాత్ర ద్వారా చంద్రబాబు ఉత్తరాంధ్ర, సీమ ప్రజలకు ఏం సమాధానం చెబుతారు.…
చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నందిగం సురేష్.. అందరూ హైదరాబాద్‌లో ఉంటూ ఇక్కడికి విహార యాత్రకు వస్తున్నారంటూ మండిపడ్డారు.. ప్రజలు వీళ్లను రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తులుగా భావిస్తున్నారని కామెంట్ చేసిన ఆయన.. చంద్రబాబు, లోకేష్ ఓట్లు కూడా హైదరాబాద్‌లోనే ఉన్నాయన్నారు.. సీఎం వైఎస్ జగన్ ఓటు మాత్రం పులివెందులలో ఉందని గుర్తుచేశారు. ఇక, బద్వేల్ ఫలితాలతో చంద్రబాబు మైండ్ బ్లాంక్ అయ్యిందని సెటైర్లు వేశారు.. ఈ పాదయాత్ర…
దేశంలోనే రైతు ఆత్మహత్యల్లో ఏపీకి 3వ స్థానం లేచింది అని చెప్పిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్రంలోని అరాచకపాలన వల్లే అన్నదాతల ఆత్మహత్మలు చేసుకుంటున్నారు అని అన్నారు రోజుకి సగటున ముగ్గురు రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. వైసీపీ సర్కారు తీరుతో రెండున్నరేళ్లలో 34 శాతం పెరిగిన ఆత్మహత్యలు. ఇప్పటికైనా రైతాంగాన్ని ఆదుకోకపోతే రైతుల్లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది. జగన్ సీఎం అయ్యాక ఒక్క 2020 సంవత్సరంలోనే 889 మంది రైతులు బలవన్మర ణాలకు…
ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్లీనరీలో ఏపీలో పార్టీ పెట్టాలనుకుంటున్నట్లు సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను లోకేష్ ప్రస్తావించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎద్దేవా చేయడం సీఎంగా మీకు అవమానం అనిపిస్తుందో లేదో కానీ, ఐదుకోట్ల ఆంధ్రులకు మాత్రం ఆ వ్యాఖ్యలు తీరని అవమాకరంగా భావిస్తున్నారని లోకేష్ అభిప్రాయపడ్డారు. మరోవైపు ఏపీ సర్కారు ఎయిడెడ్ విద్యాసంస్థల ఆస్తులపై కన్నేసిందని, ప్రభుత్వం…
వైసీపీ సర్కారుపై మరోసారి టీడీపీ నేత లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ కార్యాలయాలపై దాడులు చేయాలని పోలీసులే వైసీపీ కార్యకర్తలను పంపిస్తున్నారని లోకేష్ ఆరోపించారు. దాడి చేశాక.. వారిని పంపడానికి గుంటూరు నుంచి డీఎస్పీ వస్తారని సెటైర్ వేశారు. కొన్ని పిల్లులు పులులమని అనుకుని భ్రమపడుతున్నాయని లోకేష్ ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు చేస్తున్నవన్నీ గుర్తు పెట్టుకుంటున్నామని చెప్పిన ఆయన.. తమ పార్టీ కార్యాలయంలో పగిలినవి అద్దాలేనని.. కానీ తమ కార్యకర్తల గుండెలను బద్దలు కొట్టలేరని…
పార్టీ కార్యాలయంపై దాడి చేయండని పోలీసులే వైసీపీ కార్యకర్తలను పంపిస్తున్నారు అని టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. దాడి చేశాక.. వారిని పంపడానికి గుంటూరు నుంచి డీఎస్పీ వస్తారు. కొన్ని పిల్లులు పులులమనుకుంటున్నాయి. ఒక చెంప కొడితే రెండు చెంపలు కొడతాం. వైసీపీ నేతలు చేస్తున్నవన్నీ గుర్తు పెట్టుకుంటున్నాం. ఏపీలోనే కాదు.. దేశంలో ఎక్కడున్నా వదిలి పెట్టం. మా పార్టీ కార్యాలయంలో పగిలినవి.. అద్దాలే మా కార్యకర్తల గుండెలు బద్దలు కొట్టలేరు. మాది పేటీఎం బ్యాచ్…
చంద్రబాబుకు మతి భ్రమించిందని మంత్రి గుమ్మనూరు జయరాం ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెండున్నరేళ్ల పాలనలో సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక చంద్రబాబు మాటల దాడులు చేస్తున్నారన్నారు. చంద్రబాబుకు శవరాజకీయాలు, కుల, మత రాజకీయాలు చేస్తున్నారని ఆయన వయస్సుకు ఇవి తగవని మంత్రి జయరాం అన్నారు.జగన్ మోహన్ రెడ్డిని తిట్టడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని ఇది సమంజసం కాదన్నారు.నారాలోకేష్‌కు జయంతి, వర్థంతికి తేడా తెలియదని, మంగళగిరిలో నారాలోకేషును కొట్టాలని మంత్రి జయరాం తీవ్ర స్థాయిలో మాటల తుటాలు పేల్చారు.
టీడీపీ నేత పట్టాభికి ఏం జరిగినా డీజీపీ గౌతమ్ సవాంగ్, సీఎం వైఎస్ జగన్‌దే అన్నారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. పట్టాభి అరెస్ట్‌పై స్పందించిన ఆయన.. ప్రజల్ని రక్షించే పోలీసులైతే పట్టాభిపై దాడిచేసిన వారిని అరెస్ట్ చేయాలి… కానీ, దాడికి గురైన పట్టాభినే అరెస్ట్ చేశారని.. దీంతో.. వీరు ప్రజల కోసం పనిచేసే పోలీసులు కాదని తేలిపోయిందన్నారు.. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు, ప్రతిపక్ష నేతలకీ రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేసిన నారా లోకేష్..…