నారా లోకేష్ పై నగరి ఎమ్మెల్యే రోజా షాకింగ్ కామెంట్స్ చేశారు. లోకేష్ వ్యాఖ్యలు చూస్తుంటే.. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లుగా ఉందని… కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో లోకేష్ ఒక వీధి రౌడీ మాదిరే మాట్లాడుతున్నారని చురకలు అంటించారు. కుప్పం అభివృద్ది పట్టని చంద్రబాబు ,లోకేష్ ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారని.. సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పం ప్రజలు అందరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు.
కుప్పం లో ప్రజలకు ఎమ్మెల్యే గా గెలిచిన చంద్రబాబు తాగునీరు కూడా అందించలేని దుస్థితి ఉందని… చంద్రబాబు కు ఎందుకు ఓట్లు వేశమా అని ఆలోచన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కోవిడ్ సమయంలో ఓట్లేసి గెలిపించిన కుప్పం ప్రజల్ని పట్టించుకోలేదని మండిపడ్డారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు చూసి రాష్ట్రంలో ప్రతి ఒక్కరు వైసీపీ ని గెలిపిస్తున్నారన్నారు. పంచాయితీ, ఎం.పి.టి.సి, జడ్పిటిసి, బద్వేలు ఉప ఎన్నికల్లో వై.ఎస్.ఆర్ సి.పి ను భారీ ఘనవిజయంతో గెలిపించారని గుర్తు చేశారు. కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు.