ఆళ్లగడ్డ నైట్ హాల్ట్ నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండో రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతుంది. నైట్‌హాల్ట్ పాయింట్ వద్ద సీఎం జగన్‌ను ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు కలిశారు.
అహోబిలం.. ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలో ఉన్న అద్భుతమైన ప్రదేశం. దేశంలోని 108 వైష్ణవ దివ్య దేవాలయలలో ఇది ఒకటి. దిగువ అహోబిలం, ఎగువ అహోబిలంలో ఉన్న రెండు అందమైన ఆలయాలకు ఈ ప్రాంతం ఎంతగానో ప్రసిద్ధి. ఇక్కడి స్థానిక పురాణం ప్రకారం.. విష్ణువు అవతారమైన నరసింహ స్వామి ప్రహ్లాదుడిని ఆశీర్వదించి హిరణ్యాక్షిపును సంహరించిన్నట్లు తెలుస్తుంది. ఇకపోతే అహోబిలం నరసింహ ఆలయం మొత్తం 9 దేవాలయాలలో ప్రధాన ఆలయం అన్నిటికంటే పురాతనమైనది. కొండా కింది ప్రాంతంలో దిగువ…
టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి మాట్లాడుతూ.. నా తల్లిదండ్రుల సాక్షిగా మాట ఇస్తున్నాను.. బనగానపల్లెలో పేదలకు నా సొంత డబ్బులతో 2 సెంట్ల స్థలం ఇచ్చి తీరుతా! అని వెల్లడించారు. నేను బనగానపల్లె ప్రజలకు రుణపడి ఉన్నాను అని ఆయన పేర్కొన్నారు.
శ్రీశైలం దేవస్థానం అభివృద్ధి పనుల శంకుస్దాపన సమయంలో సభా వేదికపై మంత్రి కోట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యే చక్రపాణిరెడ్డిలు ఒకరిపై ఒకరు బహిరంగ ఆరోపణలు చేసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానానికి రూ. 215 కోట్లతో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి శంకుస్థాపన చేశారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి కోట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యే చక్రపాణిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొబ్బరికాయ కొట్టి అభివృద్ధి పనులను ప్రారంభించారు మంత్రి. అయితే…
YCP Leader stopped the 104 Vehicle from entering the Village: నంద్యాల జిల్లా రుద్రవరం మండలం మందలూరులో వైసీపీ నాయకుడు శ్రీనివాస రెడ్డి వీరంగం సృష్టించాడు. వైద్య సేవలందించేందుకు వెళ్లిన 104 వాహనంతో పాటు వైద్య సిబ్బందిని అతడు అడ్డుకున్నారు. తన భార్య గ్రామ సర్పంచ్ అని, మా పర్మిషన్ లేకుండా గ్రామంలోకి ఎలా వస్తారని 104 వాహనంకు ట్రాక్టర్ అడ్డుగా పెట్టాడు. అంతేకాకుండా వైద్య సిబ్బందితో శ్రీనివాస రెడ్డి వాగ్వాదానికి దిగాడు. Also…