రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నంద్యాల జిల్లా ముచ్చుమర్రి మైనర్ బాలిక కేసులో తాజా వివరాలను ఎస్పీ అధిరాజ్ సింగ్ రానా మీడియాకు వెల్లడించారు. కేసు ఇంకా విచారణ దశలో ఉందని.. బాలిక మృతదేహాన్ని ఇంకా గుర్తించాల్సి ఉందని ఆయన చెప్పారు. ముచ్చుమర్రిలో 7వ తేదీన బాలిక మిస్ అయిందని.. ఫిర్యాదు అందిన వెంటనే బాలిక కోసం వెతికామని ఆయన తెలిపారు.
ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సిద్ధం అవుతోంది.. ఈ రోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, భద్రతపై నాలుగు జిల్లాల అధికారులతో నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు, ఎస్పీ రఘువీర్ రెడ్డి సమావేశం నిర్వహించారు.. మార్చి 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో.. ఈ ఏడాది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు 10 లక్షలకు పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు..