Mahashivratri Brahmotsavam: ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సిద్ధం అవుతోంది.. ఈ రోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, భద్రతపై నాలుగు జిల్లాల అధికారులతో నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు, ఎస్పీ రఘువీర్ రెడ్డి సమావేశం నిర్వహించారు.. మార్చి 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో.. ఈ ఏడాది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు 10 లక్షలకు పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.. తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక నుండి సుమారు 1,120 ప్రత్యేక బస్సులను నడపనున్నాయి ఏపీఎస్‌ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీ, కర్ణాటక ఆర్టీసీ అధికారులు.. ఇక, భక్తుల రద్దీ దృష్ట్యా.. ఏర్పాట్లపై ఫోకస్ పెట్టింది అధికార యంత్రాంగం.
Read Also: Tirupati Bypoll: తిరుపతి లోక్‌సభ బై పోల్ ఎపిసోడ్.. మరో అధికారిపై వేటు..
భక్తుల సౌకర్యార్థం సుమారు 35 లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచుతాం అంటున్నారు ఆలయ చైర్మన్.. ఇక, భక్తులకు సులభతరంగా దర్శనం కోసం నాలుగు ప్రత్యేక క్యూ లైన్ లను ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా శ్రీశైలం ఆలయ ఈవో పెద్దిరాజు వెల్లడించారు.. అయితే, ట్రాఫిక్, పార్కింగ్, త్రాగునీరు, క్యూలైన్స్, విద్యుత్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్.. భక్తులకు త్రాగునీటి ఇబ్బందులు లేకుండా అటవీప్రాంతంలో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక, ట్రాఫిక్ సమస్య లేకుండా 75 సీసీ కెమెరాలతో పాటు అదనంగా డ్రోన్ కెమెరాలతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలిస్తాం అని పేర్కొన్నారు ఎస్పీ రఘువీర్ రెడ్డి.. మరోవైపు.. శివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో.. శ్రీశైలంలోని ఔటర్ రింగ్ రోడ్డు, టోల్ గేట్, శౌచాలయలు, పార్కింగ్ ప్రదేశాలను జిల్లా కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు.. ఆయా ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలు, చేయాల్సిన ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.