Milk Price Hike: సామాన్యులకు మరో షాక్ తగిలింది. ఆగస్టు 1 నుంచి నందిని పాల ధరను లీటరుకు రూ.3 పెంచుతూ కర్ణాటక మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. నందిని అనేది కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (KMF) ఉత్పత్తుల బ్రాండ్ పేరు. మంత్రివర్గ సమావేశంలో పాల ఉత్పత్తిదారుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.