Uma Maheswari: ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి అంత్యక్రియలు ఎల్లుండి జరగనున్నాయి. అమెరికాలో ఉన్న ఆమె పెద్ద కుమార్తె, అల్లుడు ఇండియాకు రావాల్సి ఉంది. వాళ్లిద్దరూ వచ్చిన తర్వాతే అంత్యక్రియలను నిర్వహించాలని నందమూరి కుటుంబ సభ్యులు నిర్ణయించారు. మరోవైపు ఉమా మహేశ్వరి మృతదేహానికి ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఆమె కళ్లను కుటుంబీకులు దానం చేశారు. భౌతిక కాయాన్ని జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసానికి తరలించారు. కాగా ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి హఠాన్మరణం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు…
Uma Maheswari Death Mystery: దివంగత నటుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమా మహేశ్వరి(52) ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలతోనే ఉమా మహేశ్వరి సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు ఆమె మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు భౌతికకాయం అప్పగించారు. ఈరోజు…
NTR Last Daughter Uma Maheswari: నందమూరి ఫ్యామిలీలో విషాదం నెలకొంది. దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి సోమవారం మధ్యాహ్నం హఠాన్మరణం చెందారు. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసంలో కన్నుమూశారు. ఆమె మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కంఠమనేని ఉమామహేశ్వరి ఎన్టీఆర్‌కు నాలుగో కూతురు. ఆమె భర్త కంఠమనేని శ్రీనివాస్ ప్రసాద్. ఉమామహేశ్వరి మరణవార్తను విదేశాల్లో ఉన్న నందమూరి కుటుంబ సభ్యులకు కూడా అందజేశారు. కాగా…
నందమూరి తారక రామారావు.. ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు. తెలుగు చిత్ర పరిశ్రమకే వన్నెతెచ్చిన మహనీయుడు ఎన్టీఆర్. రంగం ఏదైనా, పాత్ర ఎలాంటిదైనా ఆయన దిగనంత వరకే.. చరిత్ర సృష్టించాలన్నా.. ఆ చరిత్రను తిరగరాయాలన్నా కేవలం ఎన్టీఆర్ వలనే అవుతుంది. ఇప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమ ప్రస్తావన తెస్తే మొదట వినిపించేది నందమూరి తారక రామారావు పేరే అనడంలో ఎటువంటి సందేహం లేదు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా కళామ్మ తల్లికి, ప్రజలకు ఎన్నో సేవలు…
ఈ ఏడాది డిసెంబర్ టాలీవుడ్ కి కలిసి వచ్చింది. ఈ నెలలో విడుదలైన మూడు సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. బాలకృష్ణ అఖండ, బన్నీ పుష్ప, నాని శ్యామ్ సింగరాయ్… కరోనా తరువాత థియేటర్లలో విడుదలైన ఈ సినిమాలు ప్రేక్షకులను కనువిందు చేశాయి. ఇకసినీ ప్రముఖులు సార్థం థియేటర్లు కి వెళ్లి సినిమాలు చూస్తున్నారు. తాజాగా నందమూరి బాలకృష్ణ కుటుంబంతో సహా పుష్ప సినిమాను వీక్షించారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు బాలయ్య కోసం స్పెషల్ స్క్రీనింగ్…
అసలు నందమూరి, మెగా ఫ్యామిలీలో ఏం జరుగుతోంది ?… ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల మధ్య ఇదే ప్రశ్న మెదులుతోంది. గతంలో నందమూరి, మెగా ఫ్యామిలీలు పెద్దగా కలిసిన సందర్భాలు లేవు. ముఖ్యంగా సినిమా ఈవెంట్లలో… అందుకే ప్రస్తుతం టాలీవుడ్ లో జరుగుతున్న పరిణాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. బాలయ్య వేడుకకు అతిథిగా మెగా హీరో !నటసింహం నందమూరి బాలకృష్ణ, యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి దర్శకత్వంలో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “అఖండ”. ఇక ఇందులో బాలయ్య అఘోరా…
ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనపై నందమూరి ఫ్యామిలీ ఖండించడంపై వైసీపీ నేత లక్ష్మీపార్వతి స్పందించారు. అసెంబ్లీలో ఏమీ జరగకపోయినా టీడీపీ నేతలు మసిపూడి మారేడుకాయ చేస్తున్నారని ఆరోపించారు. ఆనాడు ఎన్టీఆర్‌ను మోసం చేసినట్లే.. ఈనాడు నందమూరి కుటుంబాన్ని చంద్రబాబు మోసం చేస్తున్నాడని లక్ష్మీపార్వతి విమర్శలు చేశారు. కన్నీళ్లు పెట్టుకుని చంద్రబాబు పెద్ద సీన్ క్రియేట్ చేస్తున్నాడని ఆమె ఆరోపించారు. చంద్రబాబు వల్ల ఎన్టీఆర్ ఎంతో బాధపడ్డారని లక్ష్మీపార్వతి గుర్తుచేసుకున్నారు. Read Also: అసెంబ్లీ ఘటనపై స్పందించిన ఎన్టీఆర్…