ఈ ఏడాది డిసెంబర్ టాలీవుడ్ కి కలిసి వచ్చింది. ఈ నెలలో విడుదలైన మూడు సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. బాలకృష్ణ అఖండ, బన్నీ పుష్ప, నాని శ్యామ్ సింగరాయ్… కరోనా తరువాత థియేటర్లలో విడుదలైన ఈ సినిమాలు ప్రేక్షకులను కనువిందు చేశాయి. ఇకసినీ ప్రముఖులు సార్థం థియేటర్లు కి వెళ్లి సినిమాలు చూస్తున్నారు. తాజాగా నందమూరి బాలకృష్ణ కుటుంబంతో సహా పుష్ప సినిమాను వీక్షించారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు బాలయ్య కోసం స్పెషల్ స్క్రీనింగ్ ని వేయించారు.
బాలకృష్ణ తో పాటు ఆయన సోదరి పురందేశ్వరి, బాలకృష్ణ భార్య వసుంధర, మోక్షజ్ఞ చిన్న కూతురు తేజస్విని, ఆమె భర్త కూడా పుష్ప సినిమాను వీక్షించారు. ప్రస్తుతం బాలయ్య థియేటర్ బయట సందడి చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ప్రస్తుతం బాలకృష్ణ ఆహా లో అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో లో ఇటీవల పుష్ప టీమ్ తో బాలయ్య హంగామా చేశారు. అప్పుడే బన్నీ, బాలయ్య కోసం స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయమని చెప్పారట.. పుష్ప సినిమా బావుందని బాలకృష్ణ అన్నట్లు సమాచారం.
Aaatttt super 🔥🔥🔥. #NBK107 @MythriOfficial #Pushpa @alluarjun . #UnstoppableMeetsThaggedheLe https://t.co/npNPbsFSfW
— శ్రీనివాస్ ఆర్ (@its_srinu) December 30, 2021