Uma Maheswari Death Mystery: దివంగత నటుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమా మహేశ్వరి(52) ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలతోనే ఉమా మహేశ్వరి సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు ఆమె మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు భౌతికకాయం అప్పగించారు. ఈరోజు ఉదయం ఉమా మహేశ్వరి తన భర్తను టిఫిన్ చేయమంటూ చెప్పి తాను గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయిట్లు తెలుస్తోంది.
ఉమా మహేశ్వరి మృతిపై ఆమె కుమార్తె దీక్షిత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆత్మహత్య సంగతి బయటకు వచ్చింది. దీక్షిత ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అనారోగ్య సమస్యలతోనే తమ తల్లి ఆత్మహత్యకు పాల్పడినట్లు దీక్షిత వెల్లడించింది. ఉమామహేశ్వరి ఆత్మహత్య సమయంలో ఇంట్లో నలుగురమే ఉన్నామని.. మధ్యాహ్నం 12 గంటల సమయంలో గదిలోకి వెళ్లి తన తల్లి తలుపు వేసుకుందని.. భోజనం సమయం వరకు బయటకు రాకపోవడంతో తలుపులు తెరిచే ప్రయత్నం చేశామని.. లోపలి నుంచి గడియ పెట్టుకుని ఉందని దీక్షిత తెలిపింది.
Read Also: Nandamuri Family: నందమూరి కుటుంబంలో విషాదం.. ఎన్టీఆర్ కుమార్తె హఠాన్మరణం
మధ్యాహ్నం 2:30 గంటలకు ఉమామహేశ్వరి కుమార్తె దీక్షిత తమకు కాల్ చేసిందని పోలీసులు చెప్పారు. తమ తల్లి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందించిందన్నారు. దీంతో ఉమామహేశ్వరి మరణంపై ఐపీసీ సెక్షన్ 174 కింద అనుమానాస్పద మృతి కింద కేసు ఫైల్ చేసినట్లు పోలీసులు వివరించారు. మరోవైపు ఉమా మహేశ్వరి మరణవార్త తెలుసుకున్న నందమూరి బాలకృష్ణ హుటాహుటిన ఆమె ఇంటికి చేరుకున్నారు. ఆమె మృతితో ఎన్టీఆర్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు తదితరులు అక్కడికి చేరుకుని ఆమె భౌతికకాయానికి నివాళి అర్పించారు.