Ntr- Kalyan Ram: నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్న విషయం విదితమే. దివంగత ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన విషయం తెల్సిందే. నందమూరి కుటుంబ సభ్యులు, నందమూరి అభిమానులు అశ్రు నయనాల మధ్య ఉమా మహేశ్వరీ అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. అయితే మేనత్త చివరి చూపుకు నోచుకోలేకపోయాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. దీంతో నేడు మేనత్త కుటుంబాన్ని పరామర్శించాడు. భార్య లక్ష్మీ ప్రణతి, అన్న కళ్యాణ్ రామ్ తో కలిసి ఉమా మహేశ్వరి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించాడు.
మేనత్త మరణంతో ఎన్టీఆర్ సైతం కుంగిపోయినట్లు కనిపిస్తున్నాడు. ఉమా మహేశ్వరి మరణం నందమూరి కుటుంబానికి తీవ్ర విషాదాన్ని నింపింది. ఇక ఎన్టీఆర్.. అత్తను చివరి చూపును చూడలేదన్న బాధలో ఉన్నట్లు తెలుస్తోంది. అన్న కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విచ్చేసిన ఎన్టీఆర్ అనంతరం ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు వెళ్లడంతోనే అత్త అంత్యక్రియలకు రాలేదని తెలుస్తోంది. విషయం తెలియగానే హుటాహుటిన బయల్దేరిన ఎన్టీఆర్ దంపతులు హైదరాబాద్ లో అడుగుపెట్టగానే మేనత్త ఇంటికే వచ్చినట్లు సమాచారం. ఇక ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.