బాలయ్య ‘అన్ స్టాపబుల్’.. మూడో గెస్ట్ అతడే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్’.. నాన్ స్టాప్ గా నవ్వులు పూయిస్తూ కొనసాగుతోంది. బాలయ్య బాబు హోస్టింగ్ అదిరిపోవడంతో నెక్స్ట్ ఏ గెస్ట్ రాబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారుతోంది. మొదటి ఎపిసోడ్ లో మంచు ఫ్యామిలీ సందడి చేయగా.. రెండో ఎపిసోడ్ లో న్యాచురల్ స్టార్ నాని హంగామా చేశాడు. బాలయ్య బాబు పంచ్ లు, నాని జోక్ లతో ఈ ఎపిసోడ్ ఆద్యంతం ఆకట్టుకొంది. ఇక ఈ రెండు ఎపిసోడ్స్ తో ఈ షో పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. నెక్స్ట్ బాలయ్య ఎవరిని గెస్ట్ గా పిలవనున్నారు అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఒక వార్త షాకింగ్ కి గురిచేస్తోంది.
అభిమానులను ఆశ్చర్యపరుస్తూ మూడో గెస్ట్ గా ‘అన్ స్టాపబుల్’ షో కి రౌడీ హీరో విజయ్ దేవరకొండ రాబోతున్నాడంట. బాలయ్య.. విజయ్ దేవరకొండని చిక్కు ప్రశ్నలు వేయనున్నారట. ఇక రౌడీ హీరో విజయ్ గురించి తెల్సిందే.. ముక్కు సూటితనానికి మారుపేరుగా ఉండే ఈ హీరో.. నిజాయితీకి బ్రాండ్ అంబాసిడర్ అయినా బాలయ్య అడిగే ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానం చెప్తాడా..? అని అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే కనుక నిజమైతే ఆహా లో వచ్చిన బెస్ట్ టాక్ షో ఇదే అవ్వడం గ్యారెంటీ.. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే ఆహా వారు అధికారికంగా ప్రకటించాల్సిదే.
Also Read
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!