అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మిర్యాలగూడలో తనకున్న ప్రతికూల పరిస్థితులపై దృష్టి పెట్టారు ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు. 2014లో కాంగ్రెస్ నుంచి గెలిచి కారెక్కిన ఆయన.. 2018లో టీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి రెండోసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి గెలిచేందుకు స్కెచ్ వేస్తున్నారు భాస్కరరావు. అయితే రెండోసారి ఎమ్మెల్యే అయ్యాక.. నియోజకవర్గంలో ఆయనకు ఇంటా బయటా రాజకీయ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయనే చర్చ నడుస్తోంది. కొత్తలో వాటిని భాస్కరరావు లైట్ తీసుకున్నా.. హ్యాట్రిక్ విజయానికి…
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ నియోజకవర్గం. ఇక్కడి ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు. టీఆర్ఎస్ నుంచి వరసగా రెండోసారి ఎమ్మెల్యే. 2014లో గెలిచిన తర్వాత పెద్దగా వివాదాలు రాకపోయినా.. 2018లో గెలిచాక మాత్రం పరిస్థితిలో చాలా మార్పులు వచ్చాయని కేడర్ చెవులు కొరుక్కుంటోంది. టీఆర్ఎస్ కేడర్‌తోపాటు.. ప్రజలకు ఎమ్మెల్యే దూరం అయ్యారని టాక్ నడుస్తోంది. సొంత పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను కూడా భాస్కరరావు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మొదటి టర్మ్‌లో భాస్కరరావుకు తోడుగా ఆయన…
వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర వర్సెస్ తెలంగాణ ప్రభుత్వంగా మారిపోయింది పరిస్థితి.. యాసంగిలో వరి కొనే పరిస్థితి లేదని కేంద్రం తేల్చేయడంతో.. ప్రత్యామ్నాయ పంటలపై ఫోకస్ పెట్టాలని రైతులకు సూచిస్తోంది తెలంగాణ సర్కార్.. మరోవైపు.. ప్రతీ గింజా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు.. కేంద్రం కొనదు కానీ, రాష్ట్ర నేతలు ఇలా మాట్లాడడం ఏంటి? అంటూ టీఆర్ఎస్ మండిపడుతోంది.. ఈ తరుణంలో.. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే చేసిన…